Begin typing your search above and press return to search.

ఆ విష‌యంలో మోడీ నెంబ‌ర్ వ‌న్‌!

By:  Tupaki Desk   |   6 Dec 2017 5:07 AM GMT
ఆ విష‌యంలో మోడీ నెంబ‌ర్ వ‌న్‌!
X
దేశ రాజ‌కీయాల్లో తిరుగులేని నేత‌గా దూసుకెళుతున్న ప్ర‌ధాని మోడీకి ప‌లు రికార్డులు వంగి స‌లాం చేస్తున్నాయి. రాజ‌కీయాల్లో ఎలా అయితే త‌న హ‌వా న‌డిస్తున్నారో.. సోష‌ల్ మీడియాలోనూ ఆయ‌న జోరు సాగుతోంది. ప్ర‌ధాన మీడియాకు ప్ర‌త్యామ్నాంగా మారిన సోష‌ల్ మీడియాలో ఆయ‌న క్రేజ్ అంత‌కంత‌కూ పెరుగుతోంది. సోష‌ల్ మీడియాలో త‌న ఇమేజ్ ను జాగ్ర‌త్త‌గా కాపాడుకుంటూ వ‌స్తున్న దానికి త‌గ్గ‌ట్లే ఆయ‌న్ను అభిమానించే వారి సంఖ్య ఫాలోవ‌ర్ల రూపంలో అంత‌కంత‌కూ పెరుగుతోంది.

2017 డిసెంబ‌రు నాటికి మోడీ ఫాలోవ‌ర్ల సంఖ్య 3.75 కోట్లు కావ‌టంతో పాటు.. భార‌త‌దేశంలో ట్విట్ట‌ర్ లో అత్య‌ధికంగా ఫాలోవ‌ర్ల జాబితాలో ఆయ‌న నెంబ‌ర్ వ‌న్ గా నిలిచారు. గ‌త ఏడాది ఆయ‌న ఫాలోవ‌ర్ల సంఖ్య 2.4 కోట్లుగా ఉండేది. ఏడాది వ్య‌వ‌ధిలో 52 శాతం వృద్ధిరేటులో ప్ర‌స్తుతం ఆయ‌న ఫాలోవ‌ర్లు 3.75 కోట్ల‌కు చేరుకున్నారు. ఇక‌.. ప్ర‌పంచ వ్యాప్తంగా చూస్తే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫాలోవ‌ర్ల సంఖ్య 4.4 కోట్ల‌కు పెరిగింది.

2017ఏడాదిలో ట్రంప్‌.. మోడీలు ఇద్ద‌రు మోస్ట్ ట్వీటెడ్ వ‌ర‌ల్డ్ లీడ‌ర్లుగా టాప్ టూ స్థానాల్లో నిలిచిన‌ట్లుగా పేర్కొంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఫాలోవ‌ర్ల సంఖ్య పెర‌గ‌టం విష‌యంలో మోడీ ముందు ఉన్నా.. వృద్ధి రేటు విష‌యంలో మాత్రం క్రికెట‌ర్ కోహ్లీ 61 శాతంతో ముందు ఉండ‌టం గ‌మ‌నార్హం. దేశంలో మొద‌టి స్థానంలో ఉన్న మోడీ.. ప్ర‌పంచంలో మాత్రం ట్రంప్ స్థానంలో కొన‌సాగుతున్నారు. ఇక‌.. వ‌ర‌ల్డ్ లో టాప్ టూ త‌ర్వాత నికోల‌స్ మ‌దురో (వెనిజులా).. త‌యిప్ ఎర్డోగ‌న్ (ట‌ర్కీ).. థెరిసా మే (బ్రిట‌న్‌) లాంటి నేత‌లు ఉన్నారు. ఇక‌.. దేశం విష‌యానికి వ‌స్తే..

మోడీ మొద‌టి స్థానంలో నిలిస్తే.. రెండో స్థానంలో బిగ్ బి అమితాబ్ (3.15 కోట్లు).. మూడో స్థానంలో షారుక్ ఖాన్ (3.09 కోట్లు) నిలిచారు. త‌ర్వాతి స్థానాలు చూస్తే..

నాలుగో స్థానంలో స‌ల్మాన్ ఖాన్ 2.85కోట్లు

ఐదో స్థానంలో అక్ష‌య్ కుమార్ 2.28 కోట్లు

ఆరో స్థానంలో అమీర్ ఖాన్ 2.24 కోట్లు

ఏడో స్థానంలో దీపికా ప‌దుకునే 2.21 కోట్లు

ఎనిమిదో స్థానంలో సచిన్ 2.17 కోట్లు

తొమ్మిదో స్థానంలో హృతిక్ 2.09 కోట్లు

ప‌దో స్థానంలో కోహ్లి 2.08 కోట్లు