Begin typing your search above and press return to search.

ఆ నిర్ణయం మోడీ స్థాయిని తగ్గించడమేనా?

By:  Tupaki Desk   |   18 Oct 2016 7:23 AM GMT
ఆ నిర్ణయం మోడీ స్థాయిని తగ్గించడమేనా?
X
ప్రస్తుతం భారతదేశంలో బీజేపీ సోలోగా అత్యధిక మెజార్టీ సాధించిన పార్టీ.. మోడీపై దేశప్రజలకు ఉన్న నమ్మకమా, కాంగ్రెస్ చేసిన పనులపై కోపమా అనే విషయాలు పక్కనపెడితే, 2014 ఎన్నికల్లో మోడీని నెత్తిన పెట్టుకున్నారు భారతీయులు! తదనంతరం జరిగిన కొన్ని రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి ఎదురుగాలి వీచిన సంగతి తెలిసిందే. దేశం మొత్తం మీద అలాంటి సంఘటనలు జరగడం అత్యంత సహజం - ఎందుకంటే స్థానిక సమస్యల ప్రభావం వాటిపై ఉంటుంది. అయితే తాజాగా మరోసారి యూపీ ఎన్నికలు రాబోతున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ మోడీని - అతని స్టామినాని - అతనిపై జనాలకున్న క్రెడిబిలిటీని - సర్జికల్ స్ట్రైక్ విషయంలో ఆయన తీసుకున్న ధమ్మున్న నిర్ణయాలపై వస్తోన్న అభినందనలు నమ్ముకుని, వాటినే ప్రచార అస్త్రాలుగా ఎంచుకుని ఎన్నికల్లోకి వెళ్లాలి... కానీ బీజేపీ అలా చేయకపోవడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.

రామజన్మభూమి వివాదానికి కేంద్రమైన అయోధ్యలో రామాయణ మ్యూజియంను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. దీనికి సంబందించి స్థలాన్ని పరిశీలించేందుకు పర్యాటక శాఖ మంత్రి మహేశ్ శర్మ అయోధ్యకు వెళ్లనున్నారు. ఈ విషయం నేడు రాజకీయాల్లో సంచలనంగా మారింది. 2014 ఎన్నికల అనంతరం బీజేపీ పై, ముఖ్యంగా మోడీపై ఉన్న ఒక మతానికి సంబందించిన ముద్ర తొలగిపోయిందని అంతా భావించారు. తర్వాతి కాలంలో కూడా చెదురుమదురు సంఘటనలు జరిగినా ఆ మచ్చ మోడీకి పెద్దగా అంటింది లేదు. అయితే కావాలని చేశారో లేక రాజకీయ నాయకులకు తప్పదనే సంకేతమో కానీ... లఖ్‌ నవూలో ఇటీవల జరిగిన రామ్‌ లీలా కార్యక్రమంలో తన ప్రసంగం ప్రారంభం - ముగింపు సమయాల్లో ‘జై శ్రీరాం’ అంటూ వ్యాఖ్యానించారు. ఇది కరెక్టా కాదా అనే విషయాలు కాసేపు పక్కనపెడితే ఇది రాజ్యాంగ వ్యతిరేకమని లౌకిక వాదులు విమర్శలు చేశారు.

ఈ సంగతులు కాసేపు పక్కనపెడితే యూపీ ఎన్నికలు దగ్గరపడుతుండగా బీజేపీ తీసుకున్న నిర్ణయాలపైనే ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. నిజం చెప్పాలంటే మోడీకి హిందుత్వ అంశాలపై ఓట్లు సంపాదించాల్సిన అవసరం లేదు. ఎవరికి ఎన్ని వ్యక్తిగత అభిప్రాయాలు ఉన్నా ఫైనల్ గా దేశాభివృద్ధి - ప్రజల సంక్షేమమే ముఖ్యం. ఈ సమయంలో మోడీలాంటి నేత ఉండగా - యూపీ ఎన్నికలకు ఈ హిందుత్వ మార్క్ తో వెళ్లాలని బీజేపీ నిర్ణయించుకోవడం మాత్రం కచ్చితంగా మోడీ అభిమానులకు ఇబ్బందిని కలిగించే అంశమనే చెప్పాలి. మోడీకి జనాల్లో ఉన్న నమ్మకాన్ని - అభిమానాన్ని - ప్రధానిగా ఆయా చేస్తోన్న పనులను తీసుకుని కాకుండా బీజేపీ కి ప్రధాన అస్త్రం అయిన హిందుత్వంపై ఎన్నికలకు వెళ్లాలని పరోక్షంగా నిర్ణయించుకోవడం మోడీని అవమానించడమే అనేది పలువురి అభిప్రాయంగా ఉంది.

ఈ విషయాలపై ఇప్పటికే.. ఎన్నికలకు కొన్ని నెలలే ముందే ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అందరికీ తెలుసునని యూపీ కాంగ్రెస్ సీఎం అభ్యర్ధి షీలా దీక్షిత్ స్పందించినా, మతాన్ని రాజకీయాలతో ముడిపెట్టి రాజకీయ ప్రయోజనాలు పొందాలనుకోవడం గర్హనీయమని బీఎస్పీ అధినేత్రి మాయావతి తప్పుబట్టినా, ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ‘రామాలయం’ అంశాన్ని మళ్లీ లేవనెత్తుతున్నారని డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి ఆరోపించినా ఇవన్నీ మోడీ స్థాయిని బీజేపీ - మోడీలే తగ్గించుకుంటున్నారని అభిప్రాయపడుతున్నారు కొందరు మోడీ అభిమానులు!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/