Begin typing your search above and press return to search.

మోడీ 3 హెలికాఫ్టర్లను వాడుతున్నారేం?

By:  Tupaki Desk   |   20 Oct 2015 9:25 AM GMT
మోడీ 3 హెలికాఫ్టర్లను వాడుతున్నారేం?
X
విజయదశమి రోజు ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కోసం గన్నవరం చేరుకోనున్న ప్రధాని మోడీ.. అక్కడ నుంచి శంకుస్థాపన జరిగే ప్రాంతానికి హెలికాఫ్టర్ లో చేరుకోనున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ప్రత్యేకంగా మూడు హెలికాఫ్టర్లను సిద్ధం చేశారు.

ఇప్పటికే ఈ మూడు హెలికాఫ్టర్లు గన్నవరం చేరుకున్నాయి. ఎంఐ 8గా పిలిచే ఈ అత్యాధునిక హెలికాఫ్టర్ ను మోడీ వినియోగించనున్నారు. అయితే.. మోడీ కోసం మూడు హెలికాఫ్టర్లను వినియోగించటం గమనార్హం. ఈ అత్యాధునిక సాంకేతికతతో ఉండే హెలికాఫ్టర్లకు దాడుల నుంచి తప్పించుకునే శక్తి ఉంది. అంతేకాదు.. అవసరానికి తగ్గట్లు శత్రువుల మీద దాడి చేసే శక్తిసామర్థ్యాలు ఈ హెలికాఫ్టర్ సొంతం. అంతేకాదు.. తనవైపు దూసుకొచ్చే క్షిపణులను కూడా గుర్తిస్తుంది కూడా. ఇక.. గన్నవరం చేరుకునే ప్రధాని.. ఈ మూడింటిలో ఒక్క హెలికఫ్టర్ లో ప్రయాణిస్తారు.

అయితే.. దీనికి సంబంధించిన సమాచారం అత్యంత గోప్యంగా ఉంచుతారు. మూడు హెలికాఫ్టర్లు ఒకేసారి బయలుదేరుతాయి. ఈ మూడింటిలో దేన్లో ప్రధాని ఉన్నారన్న విషయం ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బందికి తప్ప మరెవరికీ తెలీదు. భద్రతా కారణాల వల్ల ఈ విషయాల్ని చాలా గోప్యంగా ఉంచుతారు. ఇక.. శంకుస్థాపనకు వచ్చే మోడీకి.. ఆహార.. పానీయాలకు సంబంధించిన మొత్తం వ్యవహారాల్ని మోడీ భద్రతా సిబ్బందే చూసుకోనుంది. మోడీ ఫుడ్ కు సంబంధించి ఏపీ సర్కారు చేతుల్లో ఏమీ ఉండదని చెబుతున్నారు.