Begin typing your search above and press return to search.
తెలంగాణకు మోడీ రాక.. ఇప్పుడు చూపంతా కేసీఆర్ పైనే రీజనేంటంటే!
By: Tupaki Desk | 4 Nov 2022 5:30 PM GMTప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 12 తెలంగాణకు రానున్నారు. రామగుండంలో ప్రధాని పర్యటించనున్నారు. ఎరువుల కర్మాగారాన్ని ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. అయితే, ఈ విషయం ఎలా ఉన్నా.. ఇప్పుడు అందరి చూపూ సీఎం కేసీఆర్‌పైనే ఉంది.
దీనికి కారణం.. ఆయన ఈ సభకు హాజరువుతారా? మోడీని కలుస్తారా? లేక, ఇటీవల కాలంలో ఆయన ఎలా అయితే డుమ్మా కొడుతున్నారో అదేవిధంగా తప్పించుకుంటారా? అనేది రాజకీయంగా ఆసక్తిగా మారింది.
ప్రధాని పర్యటన దృష్ట్యా సీఎస్ సోమేశ్ కుమార్ సమన్వయ సమావేశం నిర్వహించారు. సంబంధిత శాఖలు, పోలీసు అధికారులతో సమావేశమైన సీఎస్... ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. కాగా.. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు సీఎం కేసీఆర్ హాజరవుతారా..? లేదా..? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
గతంలో పలుసార్లు తెలంగాణకు మోడీ వచ్చినప్పుడు.. సీఎం స్థాయిలో కేసీఆర్ పాల్గొనలేదు. అందుకు కారణాలు కూడా కేసీఆర్ వివరించారు. తాజాగా జాతీయ పార్టీ ప్రకటించిన కేసీఆర్... ఈ నేపథ్యంలో మోడీని కలుస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు.. ఇటీవలే ఆయన మునుగోడులో నేరుగా ప్రధానిపై తీవ్ర విమర్శలుగుప్పించారు. ప్రధానిని మించిన పదవి లేదని, అయినా తమ పార్టీ ఎమ్మెల్యేలను కొంటున్నారని.. ఈ వందల కోట్లు డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది? ఎవరు పంపించారు? ప్రధాని ప్రమేయం లేకుండానే ఇదంతా జరిగిపోయిందా? అని కూడా ఆయన నిలదీశారు. ఈ నేపథ్యంలో కేఈసార్ వర్సెస్ బీజేపీ మధ్య రాజకీయంగా తీవ్రస్థాయిలో వేడెక్కింది. మరి ఇవన్నీ మరిచిపోయి మోడీని కలుస్తారా? లేదా? అనేది చూడాలి.
ఇక ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 11, 12వ తేదీల్లో ఏపీలోని విశాఖలోనూ పర్యటించనున్నారు. 10,472 కోట్ల రూపాయల విలువైన ఏడు ప్రాజెక్టులను ఆయన ప్రారంభించనున్నారు. 12వ తేదీ ఉదయం ఆంధ్ర విశ్వవిద్యాలయం మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అనంతరం తెలంగాణకు పయనం కానున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.