Begin typing your search above and press return to search.
మోడీ ఎఫెక్ట్: ఈసారి కేసీఆర్ ఢిల్లీకా? ఫామ్ హౌజ్‌కా?!
By: Tupaki Desk | 8 Jan 2023 1:30 AM GMTప్రధాని నరేంద్ర మోడీ అంటే.. కేసీఆర్‌కు మంటెత్తిపోతున్న విషయం తెలిసిందే. మోడీ అన్న పేరు వినిపిస్తే.. ఆయన నిలువెల్లా ఊగిపోతున్నారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని, అప్పులు పుట్టనివ్వకుండా.. అడ్డుకుంటున్నారని, రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వడం లేదని.. తరచుగా విమర్శలు సంధిస్తున్న కేసీఆర్, ఏకంగా మోడీని గద్దె దింపే క్రతువుకు భారత రాష్ట్ర సమితితో శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇక, మోడీ రాష్ట్రానికి వస్తున్నారని తెలిస్తే.. గత రెండేళ్లుగా కూడా కేసీఆర్ ఆయనకు కనిపించకుండా తిరుగుతున్నారు.
ప్రొటోకాల్ ప్రకారం ప్రధాని ఏ రాష్ట్రానికి వచ్చినా.. సీఎం హాజరై ఆయనకు ఆహ్వానం పలకడమో.. లేక ఆయన పాల్గొనే కార్యక్రమా ల్లో పాల్గొనడమో చేయాలి. అయితే, తేడా వచ్చిన దగ్గర నుంచి మోడీ వస్తున్నారని తెలిస్తే.. కేసీఆర్ ఢిల్లీకో.. ఇతర రాష్ట్రాలతో వెళ్లిపోతున్నారు. లేదా.. జ్వరం వచ్చేస్తోంది. దీంతో కేసీఆర్ లేకుండానే ఇప్పటికి మూడు సార్లు ప్రధాని హైదరాబాద్ వచ్చి వెళ్లారు. ఇక, ఈ పరిస్థితి ఇప్పటికీ అలానే కొనసాగుతోంది. పైగా మరింత దూకుడు పెరిగింది. ఇరు పక్షాలు `తగ్గేదేలే` అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి.
ఈ క్రమంలో తాజాగా మరోసారి ప్రధాని తెలంగాణకు వస్తున్నారు. అది కూడా అధికారిక కార్యక్రమం, అందునా.. ప్రతిష్టాత్మక వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఖరారైంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఇప్పుడు ఏం చేయనున్నారు ? అనేది ప్రశ్న. మోడీ ఈ నెల 19వ తేదీన తెలంగాణకు రానున్నారు. సికింద్రాబాద్లో వందే భారత్ రైలును ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ నుంచి విజయవాడ మధ్య వందేభారత్ రైలు ప్రయాణించనుంది. అదేవిధంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ఆధునీకరణ పనులను మోడీ ప్రారంభించనున్నారు.
అనంతరం రైల్వేస్టేషన్లో మోడీ ప్రసంగిస్తారు. ఇది పూర్తిగా అధికారిక కార్యక్రమం. మరి ప్రొటోకాల్ ప్రకారం కేసీఆర్ పాల్గొనాల్సి ఉంది. కానీ, ఆయన ఇప్పుడున్న పరిస్థితిలో పాల్గొనే అవకాశం లేదు. సో.. ఈ సారి కూడా ఢిల్లీకో.. ఫామ్ హౌజ్‌కో వెళ్లిపోవడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. అయితే, ప్రొటోకాల్ ప్రకారం.. తన మంత్రివర్గంలోని ఒకరిని పంపించి చేతులు దులుపుకొనే అవకాశం ఉందని చెబుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.