Begin typing your search above and press return to search.

మోదీ పాల‌స్తీనా ప‌ర్య‌ట‌న చారిత్ర‌కం!

By:  Tupaki Desk   |   11 Feb 2018 8:10 AM GMT
మోదీ పాల‌స్తీనా ప‌ర్య‌ట‌న చారిత్ర‌కం!
X
భార‌త ప్ర‌ధాని మోదీ ఇప్ప‌టికే ప్ర‌పంచ‌లోని ప‌లు దేశాల్లో ప‌ర్య‌టించి....భార‌త్ తో ప‌లు కీల‌క‌మైన ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా, మోదీ....తొలిసారిగా పాల‌స్తీనాలో ప‌ర్య‌టించారు. శనివారం రమల్లాలో పాలస్తీనా అధ్యక్షులు మహ్మద్ అబ్బాస్ తో మోదీ భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఇజ్రాయెల్ తో శాంతి చర్చల్లో భారత్ త‌మ‌కు సహక‌రించాల‌ని మోదీని అబ్బాస్ కోరారు. తూర్పు జెరూసలేంను పాలస్తీనా రాజధానిగా ఇజ్రాయెల్ అంగీకరించాలని - దానితో పాటు కొన్ని ష‌ర‌తులు అంగీక‌రిస్తే చర్చ‌ల‌కు సిద్ధ‌మ‌ని అబ్బాస్ కోరారు. ఓ బహుళ పక్ష శాంతి బృందాన్ని ఏర్పాటు చేసి ఇజ్రాయెల్ - పాల‌స్తీనాల‌తో చర్చ‌లు జ‌రిపి ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టాల‌ని మోదీని కోరారు. 1967 అరబ్ ఒప్పందం ప్ర‌కారం తాము శాంతి స్థాపనకు కట్టుబడ్డామ‌ని - అంతర్జాతీయ సమాజం అభీష్టం ప్ర‌కారం న‌డుచుకుంటామ‌ని అబ్బాస్ తెలిపారు. భార‌త్ - పాలస్తానాల‌ మధ్య ఆరు ఒప్పందాల‌కు ఇరు దేశాధినేత‌లు అంగీక‌రించారు.

మ‌రోవైపు, అబుదాబిలోనే అతిపెద్ద హిందూ దేవాలయానికి మోదీ శంకుస్థాపన చేయనున్నారు. 55000 చదరపు మీటర్ల స్థలంలో నిర్మించే ఈ దేవాలయంలో అందరు దేవతల ప్రతిమలు ప్ర‌తిష్టిస్తారు. ర‌మ‌ల్లాకు మోదీ వెళుతున్న చాప‌ర్ కు ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ భద్రత కల్పించింది. ఇజ్రాయెల్ - పాలస్తీనా మధ్య స‌యోధ్య కుదిర్చేందుకు మోదీ పర్యటన ఉప‌యోగ‌ప‌డింది. మోదీ ప్రయాణిస్తున్న చాపర్ వీడియోను మ‌రో చాప‌ర‌ల్ లో ఉన్న వారు రికార్డు చేశారు. దీంతో ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. మోదీ హెలికాప్టర్లో 150 కిలో మీటర్లు ప్రయాణించారు. ఈ సంద‌ర్భంగా జోర్డాన్ - ఇజ్రాయెల్ - పాలస్తీన్ ఎయిర్ స్పేస్ ను 3దేశాల ప్రభుత్వాలు ఖాళీ చేయించి భారీ భద్ర‌త‌ను ఏర్పాటు చేయ‌డం విశేషం.