Begin typing your search above and press return to search.
కాడి వదిలేసిన మోడీ.. ఆయనకు సొంత ప్రతిష్టే కావాలి!
By: Tupaki Desk | 2 May 2021 7:30 AM GMTదేశంలో కరోనా విజృంభిస్తుంటే.. ప్రధాని నరేంద్ర మోడీ కాడి వదిలేశారని, రాష్ట్రాలపైనే భారం నెట్టేసి చేతులు దులుపుకున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రాహుల్.. ఈ మేరకు వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం.
భారత్ లో కరోనా విజృంభణతో ప్రపంచమే భయపడుతోందని, అయినప్పటికీ.. ప్రధాని మోడీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. మొదటి దశపై విజయం సాధించామని గొప్పలు చెప్పకున్న ఆయన.. సెకండ్ వేవ్ పై ఎందుకు నోరు మూసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది.
సెకండ్ వేవ్ పై మొదటి నుంచీ నిపుణులు హెచ్చరిస్తున్నా.. నరేంద్ర మోడీ పెడచెవిన పెట్టారని మండిపడ్డారు. దేశంలో పరిస్థితి దారుణంగా ఉన్నా.. ఇవన్నీ పట్టించుకోకుండా ప్రధాని, హోమంత్రి బెంగాల్ లో ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారని రాహుల్ విమర్శించారట. కరోనా వ్యాప్తికి కారణమయ్యే కార్యక్రమాలను కూడా వారు ప్రోత్సహించారని ఆగ్రహం వ్యక్తంచేసినట్టు సమాచారం.
ఇక, వ్యాక్సిన్ విషయంలో కేంద్రం తీరుపైనా రాహుల్ మండిపడ్డారు. దేశంలో ఒకే వ్యాక్సిన్ కు రెండు ధరలు ఎందుకు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలోని సమస్యలన్నీ గాలికి వదిలేసిన మోడీ.. కేవలం వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకునేందుకే ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తినట్టు సమాచారం.