Begin typing your search above and press return to search.
ఆవిడ ముందు ఆయన్ను పొగిడితే అంతే!
By: Tupaki Desk | 22 Nov 2016 7:20 AM GMTయూపీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న సమయంలో రాజకీయాలు 100 డిగ్రీస్ టెంపరేచర్ కు రీచవుతునత్న టైంలో బీఎస్పీ బాస్ మాయావతి ఎదురుగా ప్రధాని మోడీని పొగిడితే ఏమవుతుంది...? ఊహించుకుంటేనే సీను అర్థమైపోతుంది... అలాంటి ఊహ నిజమైంది. ఉత్తర్ ప్రదేశ్ లో బీఎన్సీ అధినేత్రి మాయావతి పాల్గొన్న ఒక ర్యాలీలో ఆ పార్టీకే చెందిన నేత ఒకరు ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఆ సందర్భంగా ఆయన దేశంలో పెద్ద నోట్ల రద్దు ఎంత మంచి నిర్ణయమో వివిరిస్తూ మోడీపై ప్రశంసలు కురిపించడం ప్రారంభించారు. అసలే.. ఉప్పు - నిప్పుల్లాంటి పార్టీలవి. ఇంకేముంది... ఆ బీఎస్పీ నేత మోడీపై కురిపిస్తున్న ప్రశంసల జల్లును ఆపడానికి మిగతా నాయకులు ప్రయత్నించారు. కానీ, ఆయన ఆగితేనా...? మోడీ నిర్ణయం వల్ల నల్లధనం ఎలా కంట్రోలు అవుతుందో... ఫేక్ కరెన్సీకి ఎలా చెక్ పడుతుందో చెప్పుకొంటూ పోతున్నారు. దీంతో మిగతా నేతలు ఆయన నుంచి మైకు లాక్కున్నారు.
రాజకీయంగా రెండు పార్టీలూ భిన్న ధ్రువాలే అయినా ఆ బీఎస్పీ నేత తన మనసులో మాటను చెప్పేశాడు. రాజకీయాలు.. వైరుధ్యాలు - సిద్ధాంతాలు అన్నీ పక్కన పెట్టి మరీ మోడీని ఆకాశానికెత్తేశారు. ఇది మాయావతి - ఆ పార్టీ నేతలకు ఏమాత్రం రుచించలేదు. మాయావతి మొఖం కందగడ్డలా ఎర్రగా మారిపోయిందట.
కాగా మోడీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేతల్లో మాయావతి కూడా ఉన్నారు. ములాయం - కేజ్రీవాల్ - మమత తదితరులు మోడీ నిర్ణయాన్ని ససేమిరా కాదంటున్నారు. అలాంటి సందర్భంలో మోడీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న మాయా సమక్షంలోనే ఆమె పార్టీకే చెందిన నేత అలా మాట్లాడేసరికి బీఎస్పీ పరువు పోయినట్లయింది. సభకు వచ్చినవారంతా ఈ తతంగం చూసి ఒకటే నవ్వు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/