Begin typing your search above and press return to search.
మరో మారు అమ్మ వద్దకు వెళ్లి.. మనసు దోచేశాడు
By: Tupaki Desk | 5 Dec 2022 4:10 AM GMTమరోసారి మనసు దోచేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఎప్పుడేం చేస్తే ఏమవుతుందన్న విషయంపై పూర్తిస్థాయి క్లారిటీ ఉన్న మహాధినేతగా ఆయనకు పేరుంది. సమయానికి తగ్గట్లుగా వ్యవహరించే విషయంలో ఆయనకు దగ్గరకు వచ్చే వారే కనిపించరు. భావోద్వేగ అస్త్రాల్ని గురి పెట్టి విడవటం ఆయన తర్వాతే ఎవరైనా. తాజాగా అలాంటి పరిణామమే ఒకటి చోటు చేసుకుంది.
గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా ఈ రోజు (సోమవారం) తుది విడత పోలింగ్ జరగనుంది. ఈ పోలింగ్ వేళ.. నరేంద్ర మోడీ తన ఓటుహక్కును ఆయన వినియోగించుకుంటారు. అహ్మదాబాద్ లోని రనిప్ ప్రాంతంలోని ఒక ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో ఆయన ఓటు ఉంది. ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితుడు.. కేంద్ర మంత్రి అమిత్ షాకు సైతం నారన్ పూర్ ప్రాంతంలోని పోలింగ్ బూత్ లో ఆయనకు ఓటు ఉంది.
వీరిద్దరూ తమ ఓటుహక్కును వినియోగించుకోవటానికి వీలుగా ఆదివారం అహ్మాదాబాద్ కు చేరుకున్నారు. గుజరాత్ మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు ఇప్పటికే 89 స్థానాల్లో తొలి దఫా పోలింగ్ పూర్తి కాగా.. మలిదశ పోలింగ్ ఈ రోజున మిగిలిన 93 స్థానాల్లో చేపట్టనున్నారు.
ఓటు హక్కు వినియోగించుకోవటానికి వీలుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఒక రోజు ముందే అహ్మదాబాద్ చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో విమానం దిగిన వెంటనే.. గాంధీనగర్ లోని రైసన్ ప్రాంతంలో ఉండే తన తల్లి హీరాబెన్ మోడీ వద్దకు వెళ్లారు.
ఎప్పటిలానే తల్లిని అప్యాయంగా పలుకరించటం.. ఆమె పాదాలకు నమస్కారం చేయటం.. ఆమె ఆశీస్సులు పొందటంతో పాటు.. వీరిద్దరూ కలిసి కూర్చోవటం.. మాట్లాడుకోవటం లాంటివి చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు జోరుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎప్పటిలానే.. మోడీకి తల్లి మీద ఎంత ప్రేమ ఉందన్న దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.
ఏమైనా.. పోలింగ్ కు కాస్త ముందు తల్లి మీద తనకున్న ప్రేమాభిమానాలు ఎంతన్న విషయాన్ని మరోసారి ప్రదర్శించారని చెప్పక తప్పదు. ఏమైనా.. ఇలాంటివి ఎప్పుడెప్పుడు చేయాలన్న దానిపై ప్రధాని మోడీకి ఉన్నంత క్లారిటీ మరెవరికీ ఉందని చెప్పక తప్పదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.