Begin typing your search above and press return to search.

ఏపీ ప్ర‌జ‌ల‌పై మోడీ ప్ర‌శంస‌లు.. కానీ, చేసిందేంటి?

By:  Tupaki Desk   |   12 Nov 2022 11:49 AM GMT
ఏపీ ప్ర‌జ‌ల‌పై మోడీ ప్ర‌శంస‌లు.. కానీ, చేసిందేంటి?
X
ఏపీలో అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయి.వాటిని ప‌రిష్క‌రిస్తామ‌ని కానీ, ఆయా స‌మ‌స్య‌లు త‌మ దృష్టిలో ఉన్నాయని కానీ, లేదా.. ప‌రిశీలిస్తున్నామ‌ని కానీ.. ప్ర‌ధాని మోడీ చెప్ప‌లేదు. అస‌లు ఏపీకి స‌మ‌స్య‌లే లేవ‌న్న‌ట్టుగా ఆయ‌న వ్య‌వ‌హ‌రించారు. ఇదే స‌మ‌యంలో ఏపీ ప్ర‌జ‌ల‌పై నాలుగు ప్ర‌శంస‌లు కురిపించి.. వెళ్లిపోయారు. ఇత‌మిత్థంగా ఏపీలో ప్ర‌ధాని మోడీ ప‌ర్య‌ట‌న చెబుతున్న వాస్త‌వం ఇదే!

ఏపీ ప్ర‌జ‌ల‌పై మోడీ కురిపించిన ప్ర‌శంస‌లు ఏంటంటే.. ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రా ప్రజలు తమ ప్రతిభను చాటుతున్నారని ప్రధాని మోడీ అన్నారు. వైద్యం, వ్యాపారం, సాంకేతిక రంగాల్లో ప్రజలు రాణిస్తున్నారన్నారు. భారత్‌కు విశాఖపట్టణం ప్రత్యేకమైన నగరమని ప్రధాని అభివర్ణించారు. ప్రాచీన కాలం నుంచి విశాఖ పోర్టుకు ఘన చరిత్ర ఉందన్న మోడీ.. ఎన్నో ఏళ్లుగా ప్రముఖ వ్యాపార కేంద్రంగా విరాజిల్లుతోందని వ్యాఖ్యానించారు.

"ప్రాచీనకాలం నుంచి విశాఖ పోర్టుకు ఘన చరిత్ర ఉంది. ఎన్నో ఏళ్లుగా ప్రముఖ వ్యాపార కేంద్రంగా విశాఖ విరాజిల్లుతోంది. వెయ్యేళ్ల క్రితమే పశ్చిమాసియా, రోమ్‌కు విశాఖ నుంచి వ్యాపారం జరిగేది. ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రా ప్రజలు తమ ప్రతిభను చాటుతున్నారు.

వైద్యం, వ్యాపారం, సాంకేతిక రంగాల్లో ఏపీ ప్రజలు రాణిస్తున్నారు. విశాఖ రైల్వేస్టేషన్‌తో పాటు పోర్టును ఆధునీకరిస్తున్నాం. బహుముఖ రవాణా వ్యవస్థ దిశగా విశాఖ ముందడుగు వేస్తోంది. విశాఖ ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ, అభివృద్ధికి అడుగులు. మిషన్‌ గతిశక్తి కింద ప్రాజెక్టుల్లో వేగం పెంచాం" అని మోడీ అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రా ప్రజలు తమ ప్రతిభను చాటుతున్నారని ప్రధాని మోడీ అన్నారు. వైద్యం, వ్యాపారం, సాంకేతిక రంగాల్లో ప్రజలు రాణిస్తున్నారన్నారు. వికసించిన భారత్‌ అనే అభివృద్ధి మంత్రంతో ముందుకెళ్తున్నామని తెలిపారు. సమ్మిళిత అభివృద్ధే తమ ఆలోచన అని ప్రధాని తెలిపారు.

మౌలిక సదుపాయాలతో ఆధునిక భారత్‌ను ఆవిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. రైల్వే, రోడ్లు, పోర్టుల అభివృద్ధిలో తాము ఎప్పుడూ సందేహించలేదని తెలిపారు. అంతేత‌ప్ప‌.. ఏపీ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను మాత్రం ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.