Begin typing your search above and press return to search.
చిరు చెవిలో మోడీ గుసగుస.. పాలిటిక్సేనా? నెటిజన్ల ఆసక్తి
By: Tupaki Desk | 4 July 2022 3:54 PM GMTమెగా స్టార్ చిరంజీవి, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. ఎదురు పడ్డారు.అంతేకాదు.. చేతులు కలుపుకొని.. పరస్పరం అభినందిం చు కున్నారు. చిరంజీవి ఏకంగా.. మోడీకి సత్కారం కూడా చేశారు. ఇదంతా కూడా సోమవారం పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో నిర్వహించిన అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలో ప్రధాన ఆకర్షణగా మారింది. ఈ కార్యక్రమానికి రావాలం టూ.. బీజేపీ కీలక నాయకుడు.. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి.. స్వయంగా చిరును ఆహ్వానించారు. పైగా.. తాము పుట్టిన గడ్డపై కార్యక్రమం కాబట్టి..చిరు కూడా సంతోషంగా వచ్చారు.
ఈ క్రమంలో వేదికపైకి ఎక్కిన తర్వాత.. ముఖ్యమంత్రి జగన్.. చిరు తొలుత అభినందించుకున్నారు. కౌగిలించుకుని కుశల ప్రశ్న లు వేసుకున్నారు. ఆ తర్వాత.. జగన్ స్వయంగా చిరును మోడీకి పరిచయం చేశారు. దీంతో ఒకరినొకరు చేతులు పట్టుకుని.. ప్రధాని మోడీ, చిరు కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. చిరునవ్వులు చిందించారు.
చిరంజీవిని ప్రధాని కుశల ప్రశ్నలు వేశారు. అయితే.. ఈ గ్యాప్‌లో చిరు చెవిపైకి వంగి మరీ.. ప్రధాని ఏవో మాట్లాడడం.. అందరికీ ఆసక్తిగా మారింది. ఆయన ఏం మాట్లాడి ఉంటారు? రాజకీయాల గురించేనా? అనే ఆసక్తి.. నెటిజన్లలో జోరుగా కనిపిస్తోంది.
గతంలో కాంగ్రెస్‌లో ఉన్న చిరు.. తర్వాత కేంద్ర మంత్రిగా పనిచేశారు. కొన్నాళ్లుగా ఆయన సినిమాలపైనే దృష్టి పెట్టారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో మూడో సారి కూడా మోడీ ప్రదాని కావాలనే లక్ష్యంతో బీజేపీ అడుగులు వేస్తున్న దరిమిలా.. అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటోంది.
ఈ నేపథ్యంంలో ``మనం మరోసారి మాట్లాడుకుందాం`` అని కానీ.. ``మీరు రాజకీయాల్లోకి మళ్లీ రావలి`` అని కానీ.. మోడీ చిరు చెవిలో చెప్పి ఉంటారనేది నెటిజన్ల భావన. ఏదేమైనా.. ఈ ఆసక్తికర సన్నివేశంపై.. అనేక కామెంట్లు వస్తున్నాయి.
సభలో చిరంజీవి మాట్లాడుతూ ‘‘అల్లూరి సీతారామరాజు తెలుగుజాతి గర్వించే స్ఫూర్తి ప్రదాత. భీమవరంలో అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహావిష్కరణ ఒక అద్భుతం. ప్రధాని మోదీ చేతుల మీదుగా అల్లూరి విగ్రహ ఆవిష్కరణ చేయడంతో ఆ మహాయోధుడికి ప్రపంచ కీర్తి లభించింది’’ అని పేర్కొన్నారు. అంతకు మించి ఆయన ఎక్కడా ఏమీ మాట్లాడలేదు. కానీ, ఎక్కడ మాట్లాడినా.. తన రాజకీయ ప్రయోజనం కోసం పాకులాడే.. ప్రధాని మోడీ.. తాజాగా చిరు చెవిలో ఏం చెప్పారనేది ఆసక్తిగా మారింది.