Begin typing your search above and press return to search.

అయనకు ఇద్దరు : అన్ని ఆప్షన్లూ దగ్గర పెట్టుకున్న మోడీ...?

By:  Tupaki Desk   |   14 July 2022 10:30 AM GMT
అయనకు ఇద్దరు : అన్ని ఆప్షన్లూ దగ్గర పెట్టుకున్న మోడీ...?
X
రాజకీయాలో ప్లాన్స్ ఉండాలి. అంటే ఒకటి కంటే ఎక్కువ అని అర్ధం. ఎందుకంటే ప్లాన్ ఒక్కటే అనుకుంటే వర్కౌట్ కాకపోతే అపుడు ఇబ్బంది అవుతుంది. దాంతో ప్లాన్ ఏ సక్సెస్ కాకపోతే ప్లాన్ బీని బయటకు తీయాలి. ఇది తలపండిన రాజకీయ నేతలకు బాగా తెలిసిన పొలిటికల్ మాదమెటిక్స్ గానే చూడాలి. ఇదే ఇపుడు ఏపీలో మోడీ అమలు చేస్తున్నారా అంటే జవాబు అవును అనే వస్తోంది.

ఏపీ రాజకీయాల్లో జగన్ చంద్రబాబు చెరో వైపూ ఉన్నారు. ఈ ఇద్దరే ఏపీ రాజకీయాలను శాసిస్తున్నారు. రేపు కూడా శాసించబోతున్నారు. ఒకరు ఏపీ జనాలకు నచ్చకపోతే ఆటోమేటిక్ గా రెండవవారికి అది ప్లస్ అవుతుంది. అలా వైసీపీకి ఆదరణ తగ్గితే కచ్చితంగా అది టీడీపీకే ఫేవర్ చేస్తుంది. ఏపీలో మూడేళ్ళ పాలన తరువాత టీడీపీ సభలకు జనాలు బాగానే వస్తున్నారు. దాంతో ఆ పార్టీలో ధీమా పెరిగింది.

ఇక ఏపీలో అధికార వైసీపీకి తన ధీమా తనకు ఉంది. 151 సీట్లు కాకపోయినా 120 సీట్లతో మరోమారు అధికారంలోకి వస్తామని ఆఫ్ ది రికార్డ్ గా వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇలా రెండు పార్టీలు తమకు ఉన్న బలాబలాలను చూపిస్తూ బీజేపీని ఆకట్టుకోవాలని చూస్తున్నాయి. ఢిల్లీలో చూస్తే వచ్చే ఎన్నికల్లో మోడీ సర్కార్ మూడవసారి ఏర్పడుతుందా అంటే ఏర్పడవచ్చు కానీ పూర్తి మెజారిటీ వస్తుందా అంటేనే ఆలోచించాలి.

పొత్తులతోనే బీజేపీ ఈసారి సర్కార్ ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉంటుంది. దాంతో కొత్త మిత్రులను మోడీ సంపాదించుకోవాలి. ఆ కారణంగానే ఏపీలో జగన్ని నమ్మకమైన మిత్రుడిగా చూసుకుంటున్నారు. జగన్ సైతం కేంద్రంలో బీజేపీకి అన్ని విధాలుగా అండగా ఉంటున్నారు. ఇక బిగ్ ట్విస్టు అన్నట్లుగా రాష్ట్రపతి ఎన్నికల వేళ టీడీపీ కూడా మరోసారి బీజేపీకి దగ్గర అయింది. ఆ పార్టీ కూడా అవుట్ రేట్ గా మద్దతు ఇచ్చేసింది.

దీని వెనక కూడా బీజేపీ టీడీపీ రాజకీయాలు ఉన్నాయని అంటున్నారు. ఏపీలో తమకు ఎన్ని ఉన్నా కేంద్రం అండదండలు ఎన్నికల వేళ లేకపోతే గెలవలేము అన్న బెంగతోనే బీజేపీతో మంచి కోసం టీడీపీ ఇలా పావులు కదిపింది అంటున్నారు. మరో వైపు బీజేపీ కూడా ఈ మద్దతుని మనసారా స్వీకరించింది అని చెబుతున్నారు. ఎందుకంటే బీజేపీకి కూడా ఇలాంటి మద్దతు కావాలి.

వారి చూపు 2024 ఎన్నికల తరువాత కేంద్రానికి మద్దతు ఇచ్చే పార్టీల మీద ఉంది. ఏపీలో వైసీపీకి ప్రజాదరణ ఎంత ఉందో బీజేపీకి కూడా అంచనా లేదు. దాంతో గుడ్డిగా ఒకవైపే ఆధారపడి ప్లాన్ ఏ తోనే ఆగిపోకూడదని ప్లాన్ బీని బయటకు తీశారని అంటున్నారు. దాంతోనే చంద్రబాబుకి పచ్చ జెండా ఊపారని అంటున్నారు. రేపటి ఎన్నికల్లో టీడీపీ గెలిచినా తమ వైపు ఉండేలా చేసుకోవడంలో భాగంగానే బీజేపీ ఇలా కన్నుకొడుతోంది అని అంటున్నారు.

మొత్తానికి చూస్తే ఆయనకు ఇద్దరు అని ఒక సినిమా అప్పట్లో వచ్చింది. ఏపీలో రెండు రాజకీయ పార్టీలను చెరో వైపునా ఉంచుకుని తనకు ఇద్దరి మద్దతు ఉందని మోడీ రుజువు చేసుకున్నారు అని అంటున్నారు. ఇక ఈ ఇద్దరితోనూ ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకుండా రాజకీయ కధ నడిపించడం మాత్రం కష్టసాధ్యమే. అయితే బీజేపీ టీడీపీల మధ్య పొత్తు పొడుస్తుంది అన్న సంకేతాలు అందగానే వైసీపీ తానుగానే తప్పుకోవచ్చు అని కూడా వినిపిస్తున్న మాట.

అదే టైమ్ లో టీడీపీని అంత సులువుగా బీజేపీ పెద్దలు నమ్మరని, అందువల్ల తమతోనే కడదాకా చెలిమి చేస్తారు అన్న ధీమా వైసీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అది కూడా బెడిసి కొట్టి కాషాయం పసుపు పార్టీ రెండూ చేతులు కలిపితే అపుడు తమ దగ్గర కూడా ప్లాన్ బీ ఒకటి ఉందని కూడా చెబుతున్నారుట. మొత్తానికి రాష్ట్రపతి ఎన్నికలు కాదు కానీ ఏపీ రాజకీయాలు మాత్రం రసకందాయంలో పడ్డాయని చెప్పాలి.