Begin typing your search above and press return to search.
మోడీ ఎఫెక్ట్ః మంత్రి పదవుల ఊస్టింగ్ ఖాయం
By: Tupaki Desk | 22 May 2016 7:35 AM GMTపరిపాలన పగ్గాలు చేపట్టి రెండేళ్లు అవుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ తన టీంను ప్రక్షాళన చేసేందుకు సిద్ధమయ్యారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా - కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీలతో గంట సేపు సమావేశం అయ్యారు. ఏకకాలంలో కేంద్రమంత్రులను - కొందరు ముఖ్యమంత్రులను మార్చేందుకు కసరత్తు జరిగినట్లు సమాచారం.
రానున్న శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కనీసం ఇద్దరు ముఖ్యమంత్రులను మార్చడం గురించి వారు చర్చించినట్లు తెలుస్తోంది. ఇటీవల ముగిసిన శాసనసభ ఎన్నికలలో పార్టీ మెరుగైన ఫలితాలను చూపించిన నేపథ్యంలో అమిత్ షా రానున్న కొన్ని వారాలలో తన కొత్త బృందాన్ని ప్రకటించనున్నారు. కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పుల సమయంలోనే ఈ ప్రకటన వెలువడే అవకాశం ఉన్నది. ఇటీవలి శాసనసభ ఎన్నికలలో స్థానిక నేతలకు బీజేపీ ప్రచార బాధ్యత అప్పగించిన విషయం విదితమే. కేంద్ర క్రీడల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ అసోం ప్రచార బాధ్యతలను నెత్తిన వేసుకొని పార్టీని గెలిపించారు. రాబోయే బుధవారం ఆయన ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయనుండడంతో ఆయన స్థానంలో కేంద్ర మంత్రివర్గంలోకి కొత్తవారిని చేర్చుకోవలసి ఉంటుంది. కాగా, గుజరాత్ లో ప్రభుత్వాధినేతను మార్చడం అవసరమని పార్టీ కేంద్ర నాయకత్వం భావిస్తోంది. వచ్చే సంవత్సరం గుజరాత్ శాసనసభ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా అక్కడ 18 సంవత్సరాల ప్రభుత్వ వ్యతిరేకతను బీజేపీ ఎదుర్కొననున్నది.
గుజరాత్ లో కరవు పరిస్థితిపై చర్చించేందుకు ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ క్రితం వారం ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో నాయకత్వం మార్పు గురించి చర్చలు ఏవీ జరగలేదని ఆనందీ బెన్ ఆ తరువాత స్పష్టం చేశారు. ఇక ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి డాక్టర్ రమణ్ సింగ్ కు కొత్త పదవి ఇచ్చే అవకాశం ఉన్నదని కూడా బీజేపీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. అయితే, ఈ విషయమై ఇంకా నిర్ణయమేదీ జరగలేదని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. కాగా, సీనియర్ మంత్రులు కొందరి భవితవ్యం గురించి ఎన్నో ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే ప్రభుత్వ వర్గాలు ఈ ఊహాగానాలను ఖండించాయి. మంత్రుల మార్పు ప్రధాని విచక్షణాధికారానికి సంబంధించినదని పార్టీ, ప్రభుత్వం పేర్కొన్నాయి.