Begin typing your search above and press return to search.
పొలిటికల్ అమూల్ బేబీకి మోడీ బర్త్ డే విషెస్
By: Tupaki Desk | 19 Jun 2016 11:46 AM GMTరాజకీయం రాజకీయమే.. బర్త్ డే విషెస్.. బర్త్ డే విషెస్సే అన్నట్లుగా వ్యవహరించటం ప్రధాని నరేంద్ర మోడీకి అలవాటే. లోపల ఎన్ని ఉన్నా.. ముఖ్యనేతల పుట్టిన రోజు సందర్భంగా వారికి బర్త్ డే విషెస్ చెప్పేస్తుంటారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పెట్టే మేసేజ్ లు కూడా దాదాపుగా ఒకేలా ఉంటాయి. నిజానికి అంతకు మించి వేర్వేరుగా పెట్టటం కూడా బాగోదు కదా. కాకుంటే.. రాజకీయ ప్రత్యర్థుల మధ్య బర్త్ డే విషెస్ చెప్పుకోవటం లాంటివి గతంలో ఉండేవి కావు.
సోషల్ మీడియా పుణ్యమా అని.. తన ప్రత్యర్థికి సైతం విషెస్ చెప్పటం.. తనలోని ‘మర్యాదస్తుడి’ కోణాన్ని ఆవిష్కరించుకునే వీలును మోడీ తనదైన శైలిలో వినియోగించుకోవటం మామూలే. తాజాగా ఆయన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి 46వ బర్త్ డే విషెస్ చెప్పారు. ఆయన చిరకాలం ఆయురారోగ్యాలతో ఉండాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. తనకు బర్త్ డే విషెస్ చెప్పిన మోడీకి రాహుల్ తిరిగి ధన్యవాదాలు చెప్పారు.
ట్వీట్ తో మోడీ ఎంత మర్యాదస్తుడో చెప్పుకునే ప్రయత్నం చేసినప్పుడు.. తాను సైతం తక్కువ తినలేదన్నట్లుగా చెప్పుకోవాల్సిన బాధ్యత రాహుల్ గాంధీ మీద కూడా ఉంటుంది కదా. ప్రధాని తన ట్వీట్ తో రాహుల్ బర్త్ డే విషయాన్ని అందరికి గుర్తు చేశారని చెప్పాలి. రాహుల్ తో పాటు.. 68వ పుట్టిన రోజు జరుపుకుంటున్న మణిపూర్ ముఖ్యమంత్రి ఒక్రమ్ ఇబోబీ సింగ్ కు సైతం బర్త్ డే విషెస్ చెప్పటం మోడీ మర్చిపోలేదు సుమండి.