Begin typing your search above and press return to search.
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు ..తెలుగులో ట్విట్ !
By: Tupaki Desk | 1 Nov 2021 5:16 AM GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ ప్రజలు నైపుణ్యం, ధృడ సంకల్పం, పట్టుదలకు మారుపేరని కొనియాడుతూ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని నా సోదరీమణులకు, సోదరులకు శుభాకాంక్షలు. ఏపీ ప్రజలు తమ నైపుణ్యం, దృఢ సంకల్పం, పట్టుదలకు మారు పేరు. అందువల్ల వారు అనేక రంగాల్లో రాణిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు సంతోషంగా, ఆరోగ్యంగా, విజయవంతంగా ఉండాలని కోరుకుంటున్నాను అని తెలుగు లో ట్వీట్ చేశారు.
ప్రధాని మోదీ ఏపీ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి సంబంధించి ట్వీట్ తెలుగులో చేయడం ఆస్తకికరంగా మారింది. అంతేకాదు.. ఏపీతో పాటు ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాలకు కూడా ప్రధాని మోదీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయా రాష్ట్రాలకు కూడా అక్కడి ప్రజల మాతృభాషలోనే ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోడీ తో పాటుగా , ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పొట్టి శ్రీరాములు త్యాగఫలంతో పాటు ఎందరో అమరవీరుల పోరాట ఫలితంతో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందరికీ స్ఫూర్తిదాయమన్నారు. ఈ మేరకు రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.