Begin typing your search above and press return to search.
మోదీ విత్ మాల్యా!... వైరల్ గా ఓల్డ్ పిక్!
By: Tupaki Desk | 16 May 2019 4:11 AM GMTప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆయనను హత్తుకుని భుజంపై చేయేసి మరీ నిల్చున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా. ఈ ఫొటోను చూస్తేనే ఆశ్చర్యం కలగక మానదు. అంతా బాగున్నప్పుడు అయితే ఇదేమీ పెద్దగా ఆసక్తి రేకెత్తించదు గానీ... పరిస్థితులన్నీ తిరగబడి పరారీలో ఉన్న బకాయిదారుడిగా మారిన మాల్యా... మోదీ భుజంపై చేయేసి హత్తుకుని నిలబడితే... ఆయన తనను కలవడమే గొప్ప అన్న రీతిలో మోదీ కూడా చిరునవ్వులు చిందిస్తూ... మాల్యాను మరింత దగ్గరగా లాక్కున్నట్లుగా కనిపిస్తుంటే... ఆసక్తి రేకెత్తిస్తుంది కదా.
నిజమే... ఈ ఫొటోను చూసిన వాళ్లంతా ఇదే భావనను వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకు దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు పలు బ్యాంకులకు ఏకంగా రూ.9 వేల కోట్లకు పైగా అప్పులు ఎగవేసి లండన్ పారిపోయిన మాల్యా... అక్కడి నుంచి తిరిగి వచ్చే సమస్యే లేదంటూ చెబుతున్నారు. మోదీ ప్రధానిగా ఉన్న కాలంలోనే పారిపోయిన మాల్యా... బీజేపీ సర్కారును ఇబ్బందుల్లోకి నెట్టేశారని కూడా చెప్పాలి.
మరి ఇలాంటి పరిస్థితుల్లో... అది కూడా హోరాహోరీగా సాగుతున్న సార్వత్రిక ఎన్నికల సమయంలో మోదీతో మాల్యా దిలాసాగా ఉన్న ఫొటో కనిపిస్తే ప్రత్యేకమే కదా. ఎప్పుడో చాలా కాలం క్రితమే తీయించుకున్నదే అయినా.. తాజాగా సోషల్ మీడియాలోకి వచ్చి చేరిన ఈ ఫొటో వైరల్ గా మారిపోయింది. నల్లధనాన్ని వెలికితీస్తానని, అవినీతిపరుల అంతం చూస్తానని దాదాపుగా శపథం చేసిన మోదీ పక్కన బ్యాంకులను లూటీ చేసిన మాల్యా ఉంటే... ఆ ఫొటో వైరల్ కాకుండా ఎలా ఉంటుంది. అదే జరిగింది.