Begin typing your search above and press return to search.
మోడీకి షాకిచ్చేలా మాట్లాడిన సుబ్రమణ్య స్వామి!
By: Tupaki Desk | 3 May 2019 6:37 AM GMTఒక్కోసారేమో భారతీయ జనతా పార్టీపై వీర విధేయత చూపించడం, మరోసారేమో బీజేపీనే ఇరకాటంలో పెట్టేలా మాట్లాడటం సుబ్రమణ్య స్వామి ప్రత్యేకత. తన పార్టీని బీజేపీలో విలీనం చేసి, కొన్నాళ్ల కిందట రాజ్యసభ సభ్యత్వాన్ని పొందిన స్వామి ఆ తర్వాత కూడా రకరకాల హాట్ కామెంట్స్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో తాజాగా సుబ్రమణ్యస్వామి చేసిన వ్యాఖ్యలు ఒకింత సంచలనంగానే ఉన్నాయి.
ప్రత్యేకించి ప్రధాని మోడీకి ఝలక్ ఇచ్చేలా మాట్లాడారు సుబ్రమణ్య స్వామి. ఈయన లెక్కల ప్రకారం.. ఈ సారి ఎన్నికల్లో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మిగిలినా మోడీ మాత్రం ప్రధాని అయ్యే అవకాశాలు లేవు! ఇదీ సుబ్రమణ్యస్వామి చెప్పిన మాట.
బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మిగలవచ్చు, కమలం పార్టీనే మళ్లీ ప్రభుత్వ ఏర్పాటుకు దగ్గర కావొచ్చు అనే అంచనాల నేపథ్యంలో.. స్వామి మాట్లాడుతూ, అలా జరిగినా మోడీ మళ్లీ ప్రధాని అయ్యే అవకాశాలు లేవు అని అన్నారు. భారతీయ జనతా పార్టీకి సొంతంగా రెండు వందల ఇరవై నుంచి రెండు వందల ముప్పై ఎంపీ సీట్ల వరకూ వచ్చే అవకాశం ఉందని చాలా మంది చెబుతున్న సంగతి తెలిసిందే.
ఆ అంశం మీద స్వామి మాట్లాడుతూ.. ఒకవేళ అదే నిజం అయితే మోడీ మళ్లీ ప్రధాని కాలేరు అని అన్నారు. దానికి రీజన్లను కూడా చెప్పారు స్వామి. ఆ మేరకు సీట్లు వచ్చిన పక్షంలో తగిన మెజారిటీ కోసం మరిన్ని పక్షాలను బీజేపీ కలుపుకోవాల్సి వస్తుందని, అప్పుడు.. ఆ పార్టీలు మోడీని ప్రధానిగా ఒప్పుకోకపోవచ్చు అని వ్యాఖ్యానించారు సుబ్రమణ్య స్వామి.
మోడీ బదులు మరొక బీజేపీ నేతను ప్రధాని పీఠంలో కూర్చోబెట్టడానికి సదరు పార్టీలు ఓకే చెప్పవచ్చని స్వామి విశ్లేషించారు. మోడీ బదులు.. నితిన్ గడ్కరీకి అవకాశాలు ఉంటాయని స్వామి వ్యాఖ్యానించడం గమనార్హం. మోడీ లాగే గడ్కరీ కూడా సమర్థుడు అని, మోడీ స్థాయి వ్యక్తి అని.. గడ్కరీని ప్రశంసించారు సుబ్రమణ్యస్వామి!
మొత్తానికి సీట్లు తగ్గిన పక్షంలో మోడీకి మళ్లీ ప్రధానమంత్రి ఛాన్స్ దక్కే అవకాశాలు లేవని ఈ బీజేపీ ఎంపీనే కుండబద్ధలు కొడుతూ ఉన్నారు! అది కూడా పోలింగ్ ప్రక్రియ ముగియక ముందే ఇలా మాట్లాడుతుండటం గమనార్హం!