Begin typing your search above and press return to search.
మోడీజీ.. బండ మామూలుగా వేయట్లేదుగా?
By: Tupaki Desk | 2 July 2021 3:55 AM GMTనెత్తిన పెట్టుకొని గెలిపించిన మోడీ కారణంగా దేశ ప్రజలకు కలిగిన ప్రయోజనాలు ఏమిటని ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పటానికి కనీసం నిమిషం పట్టొద్దు. లేదంటే రెండు.. మూడు నిమిషాలు పట్టినా ఆశ్చర్యం లేదు. కానీ.. నమో సర్కారులో సామాన్యుల్ని సైతం బాదేసే విషయంలో మొహమాట పడని వైనం గురించి అడిగినంతనే గుక్కతిప్పుకోలేని రీతిలో చిట్టా చెప్పేసే పరిస్థితి.
ఎక్కడో అరవై.. డెబ్భైల దగ్గర ఉండాల్సిన లీటరు పెట్రోల్.. డీజిల్ చూస్తుండగానే వందను దాటేసింది. మరికొద్ది రోజుల్లో లీటరు డీజీల్ సైతం సెంచరీ దాటేసే రోజు దగ్గర్లోనే ఉంది. ఈ బాదుడు ఇలా ఉంటే.. సామాన్య మధ్యతరగి వంట గదుల్లో కీలకమైన గ్యాస్ బండ భారం ప్రజల మీద అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంత భారీగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర ఒక్కసారిగా పాతిక రూపాయిలకు పైనే పెరిగింది.
దీంతో 14.2 కేజీల గ్యాస్ సిలిండరో కాస్త అటూ ఇటుగా రూ.850లకు చేరుకుంది. కరోనాతో ఆదాయం అంతంత మాత్రంగా ఉన్న వేళ.. ఈ భారం ప్రజల్ని తెగ ఇబ్బంది పెడుతోంది. అదేంటి.. పెరిగే ధర గురించి మా గొప్పగా చెబుతారు. మోడీ సర్కారు ఇచ్చే గ్యాస్ రాయితీ మాటేమిటి? ఇలా గ్యాస్ బండ ఇంటికి వచ్చేస్తే.. అలా బ్యాంకులో రాయితీ సొమ్ములు వేస్తారు కదా? అన్న సందేహం రావొచ్చు. వాస్తవాన్ని చూసినప్పుడు అవాక్కు అవ్వాల్సిందే.
ఒకప్పుడు గ్యాస్ బండ మీద ఇచ్చే రాయితీ అంతకంతకూ తగ్గుతోంది. ఉదాహరణకు గత ఏడాది గ్యాస్ బండ బుక్ చేస్తే.. రాయితీ కింద నగదు బదిలీ రూపంలో ఒక్కొక్క దాని మీద రూ.255 వెనక్కి వచ్చేవి. ఇప్పుడు అది కాస్తా రూ.15 - రూ.25 మధ్యకు పరిమితమైంది. 2020 నవంబరులో సిలిండర్ ధర రూ.616 ఉండేది. ఇప్పుడు అదే బండ రూ.857గా మారింది. బండ తీసుకొచ్చినోడికి ఇచ్చే అదనపు పైసల్ని కలుపుకుంటే.. దగ్గర దగ్గర రూ.900లకు చేరుకుంటుందని చెప్పక తప్పదు.
అంటే.. గ్యాస్ బండ ఓవైపు పెరుగుతూనే.. మరోవైపు దాని మీద వచ్చే రాయితీ సొమ్ము పదుల రూపాయిలకే పరిమితమయ్యే పరిస్థితి. మొత్తంగా పెట్రోల్.. డీజిల్ ధరలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో.. గ్యాస్ బండ బాదుడుతో మోడీ సర్కారు దేశ ప్రజలకు చుక్కలు చూపిస్తోందని చెప్పక తప్పదు.