Begin typing your search above and press return to search.
మోడీ హైదరాబాద్ ట్రిప్ ఖరారు.. షెడ్యూల్ ఇదే
By: Tupaki Desk | 4 Feb 2022 1:02 AM GMTగతంలో ఎప్పుడూ లేనంతగా తీవ్రంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీరుపైనా.. ఆయన ప్రభుత్వ విధానాలపైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా విరుచుకుపడటం తెలిసిందే. మొన్నటిమొన్న బడ్జెట్ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్ని గంటన్నర పాటు చేస్తే.. దానికి స్పందనగా అదే రోజు రాత్రి సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ ఏకంగా రెండున్నర గంటల పాటు సాగటం తెలిసిందే. అసలు కంటే కొసరు ఎక్కువన్నట్లుగా.. యాక్షన్ కంటే రియాక్షన్ భారీగా ఉండటం హాట్ టాపిక్ గా మారింది.
ఒకవైపు తెలంగాణ సీఎం తీవ్రస్థాయిలో ప్రధాని మోడీపై ఆగ్రహం వ్యక్తం చేయటంతో పాటు.. దేశానికి కొత్త రాజ్యాంగం కావాలంటూ చేసిన డిమాండ్ ఇప్పుడు కొత్త కాకగా మారింది. ఇదిలా ఉంటే.. శంషాబాద్ చినజీయర్ స్వామి ఆశ్రమం వద్ద రామానుజాచార్యుల వారి భారీ విగ్రహాన్ని (సమతామూర్తి) ఆవిష్కరించే కార్యక్రమానికి హాజరు కానున్నట్లు చెప్పటం తెలిసిందే. అయితే.. ఇప్పుడున్న రాజకీయ వాతావరణం నేపథ్యంలో ఆయన వస్తారా? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఆ ప్రచారానికి చెక్ పెడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ టూర్ ఖరారైంది.
తాజాగా వెల్లడైన షెడ్యూల్ ప్రకారం ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ లో రెండు కార్యక్రమాలకు హాజరు కానున్నారు. దాదాపు ఆరు గంటల పాటు హైదరాబాద్ లో ఆయన గడపనున్నారు. శనివారం మధ్యాహ్నం 2.10 గంలకు హైదరాబాద్ కు చేరుకునే ఆయన.. రాత్రి 8.25 గంటలకు తిరిగి ఢిల్లీకి వెళ్లిపోనున్నారు. ఈ నేపథ్యంలో తగిన ఏర్పాట్లను చేస్తున్నారు. ముఖ్యంగా ముచ్చింతల్ లో మోడీ పాల్గొనే కార్యక్రమాలపై ప్రత్యేక భద్రతా దళం వివరాల్ని సేకరించింది యాగశాల ముందు పాకలో సగ భాగాన్ని తొలగించాలన్న సిబ్బంది సూచనకు తగినట్లు ఏర్పాట్లు చేయనున్నారు.
ప్రధాని మోడీ షెడ్యూల్ చూస్తే..
- శనివారం మధ్యాహ్నం 2.10 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టు
- 2.35 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి హెలికాఫ్టర్ లో పటాన్ చెర్వులోని ఇక్రిశాట్ కు పయనం
- 2.45 గంటల నుంచి 4.15 గంటల వరకు ఇక్రిశాట్ లో జరిగే స్వర్ణోత్సవాలకు హాజరు
- ఇక్రిశాట్ నూతన లోగో ఆవిష్కరణ
- సాయంత్రం 5 గంటలకు ముచ్చింతల్ లోని చిన్నజీయర్ ఆశ్రమానికి మోడీ రాక
- సమతా మూర్తి విగ్రహా ఆవిష్కరణ
- రాత్రి 8 గంటల వరకు రామానుజాచర్యుల సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొనటం
- రాత్రి 8.25 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకొని ఢిల్లీకి పయనం