Begin typing your search above and press return to search.

ఆ.. ఏముంది.. మోడీకి మ‌ద్ద‌తు పెరిగింది: ఇంట‌ర్నేష‌న‌ల్ మీడియా ఎద్దేవా!

By:  Tupaki Desk   |   22 July 2022 12:30 PM GMT
ఆ.. ఏముంది.. మోడీకి మ‌ద్ద‌తు పెరిగింది:  ఇంట‌ర్నేష‌న‌ల్ మీడియా ఎద్దేవా!
X
భార‌త్‌లో తాజాగా జ‌రిగిన రాష్ట్ర‌ప‌తి ఎన్నికలను అంద‌రూ ఆస‌క్తిగా గ‌మ‌నించిన విష‌యం తెలిసిందే. ఒడి సాకు చెందిన ఆదివాసీ మ‌హిళ ద్రౌప‌ది ముర్ముకు.. బీజేపీ ప‌క్ష నేత‌లు.. మ‌ద్ద‌తివ్వ‌డం.. ఆమెకు పోటీగా.. య‌శ్వంత్ సిన్హా ఉమ్మ‌డి ప్ర‌తిప‌క్షాల అభ్య‌ర్థిగా పోటీ కి దిగారు. ఇక‌, ముందుగానే ఊహించిన‌ట్టు ముర్ము విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. ఈ విజ‌యం సంగ‌తి ఎలా ఉన్నా.. దేశంలోనే కాకుండా.. విదేశాల్లో నూ.. భార‌త్‌లో జ‌రిగిన ప్రెసిడెంట్ ఎన్నిక‌ల‌పై తీవ్ర‌స్థాయిలో చ‌ర్చ సాగింది.

ఎందుకంటే... భార‌త్ అనుస‌రిస్తున్న విదేశాంగ విధానంలో ప్ర‌సిడెంట్ కీల‌క పాత్ర పోషిస్తారు. ఇత‌ర దేశాల‌కు మ‌న‌కు ఉన్న సంబంధాలు.. పొరుగు దేశాలైన చైనా, పాకిస్థాన్‌, నేపాల్ ల‌తో ఉన్న వివాదాలు.. విభేదాల నేప‌థ్యంలో రాష్ట్ర‌ప‌తి తీసుకునే నిర్ణ‌యాల‌కు ప్రాధాన్యం ఉంది. ఈ నేప‌థ్యంలో భార‌త్‌లో జ‌రిగిన రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల‌పై అంత‌ర్జాతీయ మీడియా ఆది నుంచి ప్ర‌త్యేక క‌థ‌నాలు ఇస్తూనే ఉంది. ఈ క్ర‌మంలో తాజాగా ముర్ము విజ‌యాన్ని అన్ని ప్ర‌తిక‌లు.. ఫ‌స్ట్ పేజీల్లోనే ప్ర‌చురించాయి.

ముర్మును ఎంపిక చేయ‌డం ద్వారా.. ఎస్టీ సామాజిక వ‌ర్గాల‌కు భార‌త్ ఎంతో ప్రాధాన్యం ఇస్తోంద‌ని.. అను కూల అంత‌ర్జాతీయ మీడియా పేర్కొన‌గా.. కొన్ని ప‌త్రిక‌లు.. ముఖ్యంగా చైనా, పాకిస్థాన్ స‌హా.. అమెరికాలోని త‌ట‌స్థ మీడియా కూడా.. దీనిని `మోడీ విజ‌యం`గా పేర్కొనడం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలో ముర్మును ఏమా త్రం శంకించాల్సిన అవ‌స‌రం లేద‌ని.. ఆమె నిబ‌ద్ధ‌త‌ను త‌ప్పుబ‌ట్టాల్సిన అవ‌స‌రం లేద‌ని పేర్కొన్న త‌ట స్థ అంత‌ర్జాతీయ మీడియా.. మోడీపై మాత్రం వ్యంగ్యాస్త్రాలు సంధించింది.

``హిందూ మ‌హాస‌ముద్రం, ఫ‌సిఫిక్ విష‌యంలో భార‌త్ అనుస‌రిస్తున్న ధోర‌ణి.. కొన్నాళ్లుగా మింగుడు ప‌డ‌డం లేదు. ర‌ష్యా విష‌యంలోనూ.. భార‌త్‌.. ఎటూ తేల్చుకోలేక‌పోతోంది. ఈ నేప‌థ్యంలో భార‌త్ భ‌విష్య‌త్తులో అనేక స‌వాళ్ల‌కు సిద్ధం గా ఉండాలి.

ఈ క్ర‌మంలో రాష్ట్ర‌ప‌తి నిర్ణ‌యాలు.. కీల‌కం కానున్నాయి. మోడీ ప్ర‌భుత్వ దూకుడును రాష్ట్ర‌ప‌తిగా అడ్డుక‌ట్ట వేయాలి. కానీ, ఇప్పుడు మోడీకి మ‌రో మ‌ద్ద‌తు ల‌భించిందే త‌ప్ప‌.. స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం మాత్రం కాదు`` అని అంత‌ర్జాతీయ మీడియా ఎద్దేవా చేయ‌డం గ‌మ‌నార్హం.

అంటే.. ముర్ము.. మౌన పాత్ర‌పోషిస్తారే త‌ప్ప‌..అంత‌ర్జాతీయ స్థాయిలో ప్ర‌భుత్వం తీసుకునే నిర్ణ‌యాల‌ను కానీ.. వ్య‌క్తిగ‌తంగా ఆమె పోషించే రోల్ కానీ.. పెద్ద‌గా ఉండ‌ద‌ని.. ఈ మీడియా స్ప‌ష్టం చేయ‌డం గ‌మ‌నార్హం. స‌హ‌జంగానే అంత‌ర్జాతీయ మీడియా ఇలాంటి వి రాసిన‌ప్పుడు వెంట‌నే రియాక్ట్ అయ్యే కేంద్రం.. తాజాగా మాత్రం మౌనంగా ఉండ‌డం గ‌మ‌నార్హం.