Begin typing your search above and press return to search.
హైకోర్టుపై సంచలన వ్యాఖ్యాలు చేసిన మోదుగుల
By: Tupaki Desk | 3 March 2022 11:30 AM GMTఇవాళ మూడు రాజధానులకు సంబంధించి అదేవిధంగా సీఆర్డీఏ పునరుద్ధరణకు సంబంధించి హైకోర్టు తీర్పు చెప్పింది.దీనిపై భిన్నమయిన రీతిలో అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.టీడీపీ ఈ తీర్పును స్వాగతిస్తూ కొన్ని మాటలు కూడా చెప్పింది.ఇది రైతుల విజయమని అభివర్ణిస్తోంది.
అదేవిధంగా కోర్టు చెప్పిన విధంగా సీఆర్డీఏను పునరుద్ధరించి సాధ్యమైనంత త్వరగా రాజధాని అభివృద్ధి పనులు చేపట్టాలని కూడా కోరుతోంది.ఇది ఆంధ్రుల విజయం అమరావతి విజయం అని అంటోంది. ఇదే సమయంలో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి స్పందించారు.
ఆయన మాత్రం తీవ్ర స్థాయిలో కోపం అవుతున్నారు.ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు.రాష్ట్ర విభజనకు సంబంధించి పిటిషన్లు దాఖలు చేస్తే ఇంతవరకూ అవి విచారణకు రాలేదని,కోర్టులు తమకు అవసరం అయిన అంశాలపైనే దృష్టి సారిస్తున్నాయని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు.
అంతేకాకుండా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఎన్నిక చెల్లదని తాము 2019లో దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ్టికీ విచారణకు రాలేదని ఆవేదన చెందారు. న్యాయ వ్యవస్థ,శాసన వ్యవస్థ ఈ రెంటిలో ఏది గొప్ప అన్నదానిపై చర్చ జరగాలి అని, అసెంబ్లీ అంగీకరించి ఆమోదించిన విషయాలపైనే కోర్టులు చెల్లవని చెప్పడం ఏంటి అని ప్రశ్నించారు.