Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ చీఫ్‌ గా అజారుద్దీన్‌

By:  Tupaki Desk   |   29 Jun 2016 5:45 AM GMT
కాంగ్రెస్ చీఫ్‌ గా అజారుద్దీన్‌
X
తెలంగాణ కాంగ్రెస్ బాధ్య‌త‌ల‌ను మాజీ క్రికెట‌ర్ అజారుద్దీన్ చేప‌ట్ట‌నున్నారా? ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ తో విల‌విల్లాడుతున్న కాంగ్రెస్‌ ను ఆదుకునేందుకు క్రికెట‌ర్‌ ను తెర‌మీద‌కు తెచ్చేందుకు ఆ పార్టీ సిద్ధం అవుతోందా? అంటే ఢిల్లీలో జ‌రుగుతున్న ప‌రిణామాలు అవున‌నే అనిపిస్తున్నాయి.

అధికార టీఆర్ ఎస్ పార్టీ ఆధ్య‌ర్యంలో జ‌రుగుతున్న ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ను పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి - సీఎల్పీ నాయ‌కుడిగా జానారెడ్డి కంట్రోల్ చేయ‌డంలో వైఫ‌ల్యం చెందుతున్నార‌ని కాంగ్రెస్ అధిష్టానం బ‌లంగా న‌మ్ముతోంది. ఈ నేప‌థ్యంలో పార్టీ సార‌థిని మార్చ‌డ‌మే ఏకైక మార్గ‌మ‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలో ఒకింత గ్లామ‌ర్‌ తో పాటు మైనార్టీ ఓట్ల‌ను కూడా చేజిక్కించుకునేందుకు అజారుద్దీన్‌ను తెర‌మీద‌కు తెస్తున్న‌ట్లు కాంగ్రెస్ వ‌ర్గాలు చెప్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున 2009లో ఉత్త‌ర్ ప్ర‌దేశ్ నుంచి ఎంపీగా ఎన్నిక‌యిన అజారుద్దీన్ రాహుల్ గాంధీకి స‌న్నిహితుడు కాబ‌ట్టి ఈ బెర్తు ద‌క్కే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

ఇదిలాఉండ‌గా పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి కోసం మాజీ మంత్రి డీకే అరుణ‌ - మాజీ ఎంపీ విజ‌య‌శాంతి పేర్ల‌ను కాంగ్రెస్ అధిష్టానం ప‌రిశీలించిన‌ట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ చ‌రిష్మాను త‌ట్టుకోగ‌ల నాయ‌కుడిని ఎంచుకోవ‌డంలో భాగంగా అజారుద్దీన్ వైపు మొగ్గు చూపిన‌ట్లు స‌మాచారం.