Begin typing your search above and press return to search.
ఆమెది కూడా కథువా లాంటి పరిస్థితేనట!
By: Tupaki Desk | 26 April 2018 5:54 AM GMTషాకింగ్ వ్యాఖ్యలు చేశారు టీమిండియా పేసర్ మహ్మద్ షమీ సతీమని హసిన్ జహాన్. తన భర్తపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ.. గడిచిన కొంతకాలంగా హెడ్ లైన్స్ లో నిలుస్తున్న ఆమె.. తాజాగా చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనానికి తెర తీశాయి.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా అత్యాచార ఉదంతాన్ని తనకు ఎదురైన అనుభవాలతో పోల్చుకుంది షమీ సతీమణి. తన భర్త.. ఆయన కుటుంబ సభ్యులంతా తనపై అత్యాచార యత్నానికి ప్రయత్నించినట్లుగా వెల్లడించింది. కథువా ఇష్యూపై నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. తన వ్యక్తిగత జీవితాన్ని కథువా ఉదంతంతో పోల్చుకుంది.
ఒక రకంగా తాను కూడా కథువా తరహా బాధితురాలినేనని చెప్పిన ఆమె.. ఆ ఉదంతంలో బాధిత చిన్నారి చనిపోతే.. తాను మాత్రం బతికే ఉన్నట్లు వెల్లడించారు. కథువా ఉదంతంలో నిందితులు ఎంతవారైనా సరే.. శిక్ష పడాల్సిందేనని స్పష్టం చేసిన ఆమె.. కథువా ఉదంతంలో ఏమేం జరిగాయో.. తనకు కూడా అలాంటి పరిస్థితులు దాదాపుగా ఎదురైనట్లు చెప్పారు. తనను అత్యాచారం చేయాలని షమీ కుటుంబ సభ్యులు ప్రయత్నించారని.. తనను చంపి ఆపై తన శవాన్ని చెత్తకుప్పలో పడేయాలని భావించారన్నారు.
రెండు నెలల పాటు షమీ ఫ్యామిలీతో పోరాడి తాను ప్రాణాలతో బతికి బయటపడినట్లుగా ఆమె చెప్పారు. ఇప్పటికే షమీ మీదా.. అతగాడి ఫ్యామిలీ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన ఆమె తాజాగా చేసిన వ్యాఖ్యలు మరింత మంట పుట్టేలా ఉన్నాయి. హసిన్ చేసిన ఆరోపణలపై షమీ కుటుంబ సభ్యుల్ని విచారించారు. ప్రస్తుతం న్యాయపోరాటం చేస్తున్న ఆమె.. తాజాగా చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయని చెప్పక తప్పదు.