Begin typing your search above and press return to search.

ఇన్ని క‌ష్టాల త‌ర్వాత కూడా రెండో పెళ్లా?

By:  Tupaki Desk   |   11 Jun 2018 8:52 AM GMT
ఇన్ని క‌ష్టాల త‌ర్వాత కూడా రెండో పెళ్లా?
X
టీమిండియా క్రికెట‌ర్ మ‌హమ్మ‌ద్ ష‌మీ తాజాగా మ‌రోసారి వార్త‌ల్లోకి వ‌చ్చారు. గ‌డిచిన ఏడాదిగా త‌న భ‌ర్త తీరుపై ష‌మీ స‌తీమ‌ణి హ‌సీన్ ఆరోప‌ణ‌లు చేయ‌టం తెలిసిందే. భార్య ఆరోప‌ణ‌ల‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ష‌మీ.. తాజాగా త‌న రెండో పెళ్లిపై భార్య చేసిన ఆరోప‌ణ‌పై స్పందించాడు.

మొద‌టి పెళ్లితోనే తాను ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాన‌ని.. ఇలాంటివేళ మ‌ళ్లీ రెండో పెళ్లా? అంటూ ప్ర‌శ్నించారు. ఇదిలా ఉంటే.. హాసీన్ మాట్లాడుతూ త‌న భ‌ర్త ష‌మీ రంజాన్ త‌ర్వాత రెండో పెళ్లి చేసుకోవ‌టానికి సిద్ధ‌మ‌య్యాడ‌ని పేర్కొన్నారు. రంజాన్ అయిన ఐదు రోజుల త‌ర్వాత త‌న సోద‌రుడి భార్య చెల్లెల్ని ష‌మీ పెళ్లాడ‌టానికి రంగం సిద్ధ‌మైంద‌ని ఆరోపించారు.

దీనిపై స్పందించిన ష‌మీ.. మొద‌టి పెళ్లికి సంబంధించిన స‌మ‌స్య‌ల‌తోనే తానింకా స‌త‌మ‌త‌మ‌వుతున్నాన‌ని.. ఇక రెండో పెళ్లా? అన్న ఆయ‌న‌.. నేనేమైనా పిచ్చోడిలా క‌నిపిస్తున్నానా? అని ప్ర‌శ్నించారు. అంతేకాదు.. తాను కానీ పెళ్లి చేసుకుంటే హ‌సీన్ జ‌హాన్ ను త‌ప్ప‌నిస‌రిగా పిలుస్తాన‌ని అంతే ధీటుగా రియాక్ట్ అయ్యాడు. చూస్తుంటే.. భార్య చేసే ఆరోప‌ణ‌లకు ఎలా రియాక్ట్ కావాల‌న్న‌దానిపై ష‌మీ కాస్త రాటు దేలిన‌ట్లు క‌నిపించ‌ట్లేదు? ఏడాది నుంచి ఎదుర‌వుతున్న స‌వాళ్లు.. ష‌మీ మాట‌ల్ని మార్చాయంటున్నారు. గ‌తంలో మాదిరి ఆగ్ర‌హం చెంద‌కుండా కూల్ గా పంచ్ లు వేస్తున్నార‌న్న అభిప్రాయం ఉంది.