Begin typing your search above and press return to search.
సొంతూరు వెళ్లి మరీ షమీకి షాకిస్తున్న వైఫ్
By: Tupaki Desk | 7 May 2018 4:44 AM GMTటీమిండియా పేస్ బౌలర్ మొహ్మద్ షమీ.. ఆయన సతీమణి హసీన్ జహాన్ మధ్యనున్న వివాదం తెలిసిందే. తనను మోసం చేశాడని.. తీవ్రంగా హింసించినట్లుగా ఆరోపణలు చేసి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆమె కొద్దిరోజులుగా మౌనంగా ఉన్నారు. తాజాగా ఆమె మరోసారి వార్తల్లోకి ఎక్కారు.
షమీ సొంతూరు ఉత్తరప్రదేశ్ లోని సహాస్ గ్రామానికి వెళ్లటం ద్వారా మరో వివాదానికి తెర లేపారు. షమీ సొంతూరు వెళ్లిన హసీన్.. అక్కడ తన భర్త ఇంటి తాళాల్ని పగలగొట్టాలంటూ పోలీసుల్ని డిమాండ్ చేస్తున్నారు. షమీ ఇంట్లో ఇప్పుడు ఎవరూ ఉండటం లేదు. ఇంటికి తాళం వేసి ఉంది. అయినప్పటికీ.. తాను షమీ సొంతూరు వెళ్లాలనుకుంటున్నట్లుగా చెబుతున్న హసీన్.. అక్కడ తనకు రక్షణ ఇవ్వాలని కోరుతోంది.
ఇందులో భాగంగా డిడౌలీ పోలీస్ స్టేషన్ కు వెళ్లి మరీ.. స్టేషన్ ఇన్ స్పెక్టర్ ను తనకు సాయం చేయాలని కోరారు. అయితే.. ఇంట్లో ఎవరూ లేనందున ఇంటికి వెళ్లి తాళం పగలకొట్టటంలో అర్థం లేదని పోలీసు అధికారులు ఆమె డిమాండ్‌ను తోసిపుచ్చారు. మరోవైపు.. తన రెండేళ్ల కుమార్తె.. లాయర్ ను వెంట పెట్టుకొని షమీ సొంతూరు వెళుతున్నట్లు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా.. ఈ వ్యవహారంపై షమీ బంధువు ఒకరు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. జహాన్ ముందస్తు సమాచారం ఇవ్వకుండా గ్రామానికి వచ్చారని.. ఆమెను తమ ఇంటికి ఆహ్వానించినా ఆమె రావటానికి నిరాకరించినట్లుగా చెప్పారు. ఇంతకీ షమీ సొంతూరుకు జహాన్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పటానికి ఆమె నోరు విప్పటం లేదు. త్వరలోనే తాను ఆ వివరాలు వెల్లడిస్తానని.. అప్పటివరకూ వెయిట్ చేయాలని ఆమె కోరుతున్నారు.