Begin typing your search above and press return to search.
‘తాలిబన్’ మైండ్ సెట్ కు షమీ షాకిచ్చాడు
By: Tupaki Desk | 2 Jan 2017 4:30 AM GMTఅక్కడెక్కడో సిరియాలోనే.. ఇరాక్ లోనూ.. ఆప్ఘనిస్తాన్ లో ఉగ్రవాదలు చెలరేగిపోయారని.. రకరకాల ఆంక్షలతో మనుషుల్ని ఎంతగా పీక్కుతుంటున్నారన్న వార్తలు విన్నప్పుడు.. మనమెంత సుఖంగా.. సౌఖ్యంగా బతుకుతున్నామో ఇట్టే అర్థమవుతుంది. మతం పేరుతో ఆరాచకాలు సృష్టించే తాలిబన్ రాక్షస ప్రవృతి మన దగ్గర లేనందుకు ఎంతో ఒకింత ఆనందానికి గురి అవుతుంటాం. అయితే..కొంతమంది మూర్ఖులు మతం పేరు చెప్పి.. వ్యక్తిగత స్వేచ్ఛల్లో చొరబడి చేసే రచ్చ అంతా ఇంతా కాదు.
ఇలాంటి దరిద్రులకు కొందరు రాజకీయ నేతల దన్ను లభించటం.. మైనార్టీ ఓటు బ్యాంకుతో రాజకీయపక్షాలు మౌనం దాల్చటంతో కొన్నిసార్లు కొంతమంది ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతుంటారు. ఇలాంటి పరిస్థితి టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మమద్ షమీకి ఎదురుకావటాన్ని మర్చిపోలేం. తన భార్య.. పిల్లలతో కలిసి ఫోటోలు దిగి.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందుకు.. కొందరు తాలిబిన్ మైండ్ సెట్ ఉన్న వారు.. షమీ భార్య స్లీవ్ లెస్ జాకెట్ ధరించటాన్ని ప్రశ్నిస్తూ దారుణంగా పోస్టులు చేశారు. మత సంప్రదాయాలకు భిన్నంగా వ్యవహరించారంటూ విమర్శలు సంధించారు.
ఈ తీరుపై పలువురు మండిపడగా.. పలువురు క్రికెటర్లు షమీకి అండగా నిలిచారు. ఈ వ్యవహారంపై షమీ సైతం పోరాడే తత్వంతో వ్యవహరించారు. ఇదిలా ఉండగా.. కొత్త సంవత్సరం వేళ.. షమీ తన భార్యతో దిగిన మరో ఫోటోను పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో తన భార్యతో క్లోజ్ గా ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. ఇందులో షమీ సతీమణి వేసుకున్న జాకెట్ బ్యాక్ ఓపెన్ కాగా.. షమీకి హగ్ చేసుకున్న రీతిలో ఉంది. మత సంప్రదాయం విషయంలో తనకెవరూ సలహాలు సూచనలు ఇవ్వాల్సిన అవసరం లేదన్న షమీ.. తాజా పోస్ట్ లో.. ‘‘నిన్ను చూసినప్పుడు నాకో అందమైన తోడు ఉందని చెప్పగలను. హ్యాపీ న్యూ ఇయర్’’ అంటూ ముక్తాయించటం చూసినప్పుడు.. ఆ మాత్రం గుండె ధైర్యం లేకుంటే.. తాలిబన్ మైండ్ సెట్ ను మొగ్గలో తుంచేయటం సాధ్యం కాదని చెప్పక తప్పుదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/