Begin typing your search above and press return to search.
మోహన్ బాబు బుక్.. బ్రిటిష్ పార్లమెంట్లో రిలీజ్
By: Tupaki Desk | 7 May 2016 3:36 PM GMTవిలక్షణ నటుడు మోహన్ బాబు సినీ రంగ ప్రవేశం చేసి గత ఏడాది నవంబరు 22 నాటికి 40 ఏళ్లు పూర్తయింది. ఆ సందర్భంగా మంచు ఫ్యామిలీ అనేక రకాల కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా మోహన్ బాబు కెరీర్లో బెస్ట్ డైలాగ్స్ తో ఓ పుస్తకం కూడా తేవడానికి నిర్ణయించిన సంగతి తెలిసిందే. డైలాగ్ బుక్ పేరుతో ఆ పుస్తకం సిద్ధమైంది. ఈ పుస్తకాన్ని బ్రిటన్ పార్లమెంటులో ఆవిష్కరించబోతుండటం విశేషం.
ఈ నెల 11న బ్రిటన్ హౌజ్ ఆఫ్ కామన్స్ లో జరిగే ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఈ డైలాగ్ బుక్ ఆవిష్కరణ జరగబోతోంది. సాయంత్రం 6.30 నుంచి రెండు గంటల పాటు ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. దీని తర్వాత బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్ మన్ ముఖ్య అతిథిగా ఏషియన్ లైట్ లో రిసెప్షన్ కార్యక్రమం కూడా ఉంటుంది. మోహన్ బాబు కుటుంబమంతా ఈ వేడుకల్లో పాల్గొంటుంది.
డైలాగ్ కింగ్ గా గుర్తింపు పొందిన మోహన్ బాబు.. తన కెరీర్లో పలికిన అద్భుతమైన డైలాగుల్ని ఈ పుస్తకంలో పొందు పరిచారు. మోహన్ బాబు పిల్లలు విష్ణు.. మనోజ్.. లక్ష్మీ ప్రసన్న ఈ పుస్తక రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. తమ తండ్రి 40వ సినీ వార్షికోత్సవం చేసుకుంటున్న నేపథ్యంలో ఏడాది పాటు అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నట్లు విష్ణు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఏటా మోహన్ బాబు పుట్టిన రోజుకు బెస్ట్ టీచర్ అవార్డును కూడా నెలకొల్పారు.