Begin typing your search above and press return to search.
మాజీ బాస్ పై ఫస్ట్రేషన్ తీర్చేసుకున్న బాబు మోహన్
By: Tupaki Desk | 19 Aug 2019 7:35 AM GMTవందమంది జాబితాను ప్రదర్శిస్తూ.. అందులో ఇద్దరు సిట్టింగులకు సీట్లు ఇవ్వకుంటే.. అంతకు మించిన అవమానం ఇంకేం ఉంటుంది? ఇవ్వకపోతే.. ఇవ్వకపోయారు.. ఇవ్వనన్న విషయాన్ని చెప్పటమో.. లేదంటే మరో పదవి ఇస్తేనో సరిపోయే దానికి భిన్నంగా ప్రముఖ నటుడు కమ్ రాజకీయనేత బాబు మోహన్ విషయంలో టీఆర్ ఎస్ బాస్ అనుసరించిన పద్దతిపై చాలామందిలో గుర్రు ఉంది. ఎంతమంది పని చేయని నేతలకు.. ఫీల్డ్ లో నెగిటివ్ రిపోర్ట్ ఉన్న వారికో టికెట్లు ఇచ్చేసిన కేసీఆర్.. తనకు మాత్రం టికెట్ ఇవ్వకుండా దారుణంగా అవమానించినట్లుగా ఆవేదనను వ్యక్తం చేస్తుంటారు బాబు మోహన్.
నిజమే.. ఆయన బాధలోనూ అర్థం ఉందన్న మాట పలువురి నోట వినిపిస్తూ ఉంటుంది. టీఆర్ ఎస్ నుంచి బయటకు వచ్చేసి బీజేపీలో చేరిన ఆయన.. ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ నేతలు ఫోకస్ పెట్టాలని నడ్డా ఆదేశించిన నేపథ్యంలో.. మరింతగా శ్రమిస్తున్నారు.
ఇలాంటి వేళ.. మీడియాతో మాట్లాడిన బాబు మోహన్.. తన ఫస్ట్రేషన్ ను బయటపెట్టేశారు. బీజేపీకి క్షేత్రస్థాయిలో బలం ఉందో లేదన్న విషయం కొంతకాలం ఆగితే తెలుస్తుందని.. కూల్చటం తప్పించి కేసీఆర్ కు మరేం తెలీదని మండిపడ్డారు. రాజకీయాల్లో అవుట్ డేటెడ్ అంటూ ఉండదని.. అంతదాకా ఎందుకు? రేపొద్దున కేసీఆర్.. కేటీఆర్ లు ఓడిపోతే అవుట్ డేటెట్ అయిపోయినట్లా? అంటూ ప్రశ్నించారు. పాలన చేతకాకే బీజేపీని టీఆర్ ఎస్ నేతలు విమర్శిస్తున్నారంటూ మండిపడ్డారు. మొత్తానికి బాబు మోహన్ జోరు చూస్తుంటే.. తనకు ఎదురైన అవమానానికి బదులు తీర్చుకునే వరకూ నిద్రపోనట్లుగా ఆయన మాటలు ఉన్నాయని చెప్పక తప్పదు.