Begin typing your search above and press return to search.

విద్యాసంస్థలను కాపాడుకునేందుకు ఆస్తుల తాకట్టు

By:  Tupaki Desk   |   23 Jan 2019 7:22 AM GMT
విద్యాసంస్థలను కాపాడుకునేందుకు ఆస్తుల తాకట్టు
X
రెండేళ్లు గడిచినా విద్యార్థుల ఫీజురియంబర్స్ మెంట్ ను ప్రభుత్వం విడుదల చేయకపోవడాన్ని ప్రముఖ సీని నటుడు, శ్రీవిద్యానికేతన్ అధినేత డాక్టర్ మంచు మోహన్ బాబు దుయ్యబట్టారు. మంగళవారం చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల్లో నిర్వహించిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్సెమెంట్ బకాయిలు రెండేళ్లుగా చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని అన్నారు. 2017-18 - 2018-19 సంవత్సరాలకు సంబంధించిన విద్యార్థుల ఫీజు రియంబర్స్ మెంట్ కింద తమ విద్యాసంస్థకు రూ.20కోట్లను ప్రభుత్వం చెల్లించాల్సి ఉందన్నారు.

సుమారు 26ఏళ్లుగా విలువలతో కూడిన విద్యను అందించడంలో తాను ఎక్కడా రాజీ పడలేదని తెలిపారు. కళాశాల నిర్వహాణకు నెలకు సుమారు రూ.6కోట్లకు పైగా వెచ్చించాల్సి వస్తోందని తెలిపారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోయినా తమకున్న ఆస్తులను తాకట్టు పెట్టడంతోపాటు - బ్యాంకుల్లో రుణాలు తీసుకొని కళాశాలను నడిపిస్తున్నామని తెలిపారు. సిబ్బంది వేతనాలను సకాలంలో చెల్లిస్తున్నామని తెలిపారు.

తాను నమ్ముకున్న సిద్దాంతాలకు కట్టుబడి విద్యాసంస్థలను నడిపిస్తున్నానని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్ కోసం తాను నిరంతరం కృషి చేస్తుంటానని మోహన్ బాబు తెలిపారు. కాగా ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏపీ ప్రభుత్వం ఇప్పటికైనా ఫీజు రియంబర్స్ మెంట్ విడుదల చేస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నికల బీజీలో అధికార యంత్రాంగం తలమునకై ఉంది. ఇక ఎన్నికల కోడ్ కూస్తే ఇక ఇప్పట్లో ఫీజు రియంబర్స్ మెంట్ లేనట్టే. దీంతో మరికొన్ని నెలలు మోహన్ బాబు ఇబ్బందులు తప్పేట్టు కనబడటం లేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరీ ఏం జరుగుతుందో చూడాలి మరీ.