Begin typing your search above and press return to search.
బాబూ.. మాట నిలబెట్టుకో: మోహన్ బాబు
By: Tupaki Desk | 2 March 2019 10:18 AM GMTప్రముఖ సినీనటుడు - డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఫైరయ్యారు. ఇటీవల తన విద్యాసంస్థలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడి ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయంబర్స్ మెంట్ చెల్లించడంలేదని.. దీంతో తన ఆస్తులను తాకట్టు పెట్టి విద్యాసంస్థలను నడుపుతున్నానని మోహన్ బాబు వాపోయారు. దీనిపై పలుమార్లు చంద్రబాబుకు లేఖలు రాసినా స్పందించలేదని ఆరోపించారు.
కొన్ని రోజులుగా చంద్రబాబును విమర్శించని మోహన్ బాబు తనదైన శైలీలో మళ్లీ బాబుకు వార్నింగ్ ఇచ్చారు. ఏపీలో చంద్రబాబు విద్యా సంస్థలన్నింటిని నిర్వీర్యం చేస్తున్నారని మోహన్ బాబు మండిపడ్డారు. చంద్రబాబు పరిపాలన అధాన్నంగా మారిందని ఎద్దేవా చేశారు. ‘వాట్ యు ఆర్ డూయింగ్ మిస్టర్ చంద్రబాబు’ అంటూ ఫైరయ్యారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్ మెంట్ తో లక్షలాది విద్యార్థులు లబ్ధి పొందారని తెలిపారు. 2017-18లో చంద్రబాబు నాయుడు ఫీజు రియంబర్స్ బకాయిలు చెల్లించడంలో కొత్త నిబంధనలు పెట్టారని మండిపడ్డారు. మూడునెలలకొకసారి బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చినా బాబు ఇంతవరకు పెండింగ్ బకాయిలు చెల్లించలేదని ఆరోపించారు. తమ ఒక్క విద్యాసంస్థకే ప్రభుత్వం 19 కోట్ల రూపాయాల వరకు బకాయి పడిందని తెలిపారు.
తనకు చంద్రబాబు అంటే అభిమానమే కానీ.. బాబు మాత్రం తాను రాసిన లేఖలకు కనీసం బదులు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. తక్షణమే చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. తాను ఏ రాజకీయాల కోసం చంద్రబాబును విమర్శించడంలేదని తమ రావాల్సిన బకాయిలనే మాత్రం ప్రభుత్వాన్ని అడుగుతున్నామని చెప్పారు. ప్రభుత్వం ముష్టి వేసినట్లు కొద్దిగా కొద్దిగా ఇస్తుందన్నారు. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడటం మానుకోవాలని హితవు పలికారు. తక్షణమే చంద్రబాబు నాయుడు అన్ని విద్యాసంస్థలకు చెల్లించాలని లేనట్లయితే తానే ప్రత్యక్ష్యంగా ఆందోళనకు దిగాల్సి వస్తుందని స్పష్టం చేశారు.
తెలంగాణ ఎన్నికల సమయంలో కేసీఆర్ కు మద్దతుగా మాట్లాడిన మోహన్ బాబు ఇప్పుడు ఏపీ ఎన్నికల వేళ సడన్ గా చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. ఏదిఏమైనా మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేసినా ఆయన అడిగే ప్రశ్నలో నిజాయితీ ఉందని పలువురు మద్దతు పలుకుతున్నారు.