Begin typing your search above and press return to search.

వైఎస్ఆర్ పై మోహన్ బాబు హాట్ కామెంట్స్

By:  Tupaki Desk   |   8 July 2021 10:41 AM GMT
వైఎస్ఆర్ పై మోహన్ బాబు హాట్ కామెంట్స్
X
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయనకు ఘననివాళులర్పిస్తున్నారు. చాలా మంది సినీ, రాజకీయ ప్రముఖులు వైఎస్ఆర్ తో ఉన్న అనుబంధాన్ని తలుచుకుంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రజలు ఘనంగా వైఎస్ఆర్ జయంతిని జరుపుకుంటున్నారు.

గురువారం వైఎస్ఆర్ జయంతి సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు కూడా ట్వీట్ చేసిన ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. బండ్ల గణేష్, గోపిచంద్ మలినేని , కోన వెంకట్ లు వైఎస్ఆర్ కు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.

విలక్షణ నటుడు మోహన్ బాబు సైతం తాజాగా వైఎస్ఆర్ ను గుర్తు చేసుకున్నారు. 'స్నేహశీలి, రాజఠీవి, రాజకీయ దురంధరుడు, మాట తప్పడు మడమ తిప్పడు అన్న మాటకు నిలువెత్తు నిదర్శనం, పేద ప్రజల దైవం మా బావగారు అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పుట్టినరోజు నేడు. బావ గారు ఏ లోకంలో ఉన్నా ఆయనకు ఆత్మశాంతి కలుగాలని ఆయన దీవెనలు మా కుటుంబానికి, తెలుగు ప్రజలకు ఉండాలని కోరుకుంటున్నాను' అని సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు ట్వీట్ చేశారు.

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ మధ్య కాలంలో మల్లీ సినిమాల్లో నటిస్తున్నాడు. సెలెక్టెడ్ గా సినిమాలను ఎంపిక చేసుకుంటున్నాడు. 'సన్నాఫ్ ఇండియా' అనే సినిమాలో నటిస్తుండగా ఆ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది.

ఇక వైఎస్ఆర్ కుటుంబంతో మోహన్ బాబుకు బంధుత్వం ఉంది. వైఎస్ఆర్ సోదరుడి కుమార్తెనే తన కొడుకు మంచు విష్ణుకు ఇచ్చి వివాహం జరిపించారు మోహన్ బాబు. వీరి కుటుంబాల మధ్య దగ్గరి సంబంధాలున్నాయి. అందుకే మోహన్ బాబు తన బావ అంటూ ఆప్యాయంగా పిలిచారు.

ఏపీ సీఎం జగన్ సైతం తన తండ్రిని జయంతి సందర్భంగా గుర్తుచేసుకున్నాడు. 'చెదరని చిరునవ్వు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పంచిన ఆయుధమని.. పోరాడే గుణం వైఎస్ఆర్ ఇచ్చిన బలం అని.. మాట తప్పని నైజం తండ్రి నేర్పిన పాఠమని.. తండ్రి ఆశయాలే తనకు వారసత్వమని' జగన్ ఎమోషనల్ అయ్యారు.