Begin typing your search above and press return to search.

బాబు వింటే త‌ట్టుకోగ‌ల‌రా మోహ‌న్ బాబూ..

By:  Tupaki Desk   |   5 Jun 2017 6:19 AM GMT
బాబు వింటే త‌ట్టుకోగ‌ల‌రా మోహ‌న్ బాబూ..
X
గొప్ప‌లు చెప్పుకోవ‌డంలో ఏపీ సీఎం చంద్ర‌బాబును మించిన‌వారు ఉండ‌రేమో... మైక్రోసాఫ్టు సీఈవో స‌త్య నాదెళ్ల ఆ స్థాయికి చేరారంటే అందుకు నేను వేసిన పునాదులే కార‌ణం.. తెలుగు రాష్ర్టాల్లో ఇంత మంది సాఫ్టువేర్ ఇంజినీర్లు ఉన్నారంటే అది నా ఘ‌న‌తే.. అబ్దుల్ క‌లాంను రాష్ర్ట‌ప‌తి చేసింది నేనే.. వాజ్ పేయిని పీఎం చేసిందీ నేనే.. హైద‌రాబాద్ అభివృద్ధి నా పుణ్య‌మే.. ప్ర‌జ‌ల‌కు ఇంగ్లీష్ నేర్పింది నేనే.. నీరిచ్చింది నేనే, తిండి పెడుతున్న‌ది నేనే.. అంటూ చంద్ర‌బాబు నిత్యం త‌న డ‌ప్పు తాను కొట్టుకుంటార‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే, అలాంటి చంద్ర‌బాబుకు ఇంకో బాబు షాకిచ్చారు. అంతా నా ఘ‌న‌త‌ - అంతా నా గొప్ప‌.. నేనే గొప్ప అని చెప్పుకొనే చంద్ర‌బాబుకు ఓ ప్ర‌ముఖుడిని ప‌రిచ‌యం చేసిన క్రెడిట్ త‌న‌దేన‌ని మోహ‌న్ బాబు చెప్ప‌డం హాట్ టాపిగ్గా మారింది. మోహ‌న్ బాబు చెప్పింది నూటికి నూరు శాతం నిజ‌మే అయినా చంద్ర‌బాబు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటార‌న్న యాంగిల్ లో సోష‌ల్ మీడియాలో దీనిపై కామెంట్లు వ‌స్తున్నాయి.

ద‌ర్శ‌క ర‌త్న‌ - మాజీ కేంద్ర మంత్రి దాస‌రి నారాయ‌ణ‌రావు రీసెంటుగా మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. అయితే.. చాలామంది సినీ రాజ‌కీయ ప్ర‌ముఖులు దాస‌రి పార్ధివ దేహాన్ని చూడ్డానికి రాలేదు. నివాళుల‌ర్పించ‌లేదు. కానీ... ఏపీ సీఎం చంద్ర‌బాబు మాత్రం త‌న పార్టీకి చెందిన వ్య‌క్తి కాక‌పోయినా.... వెంట‌నే స్పందించి వ‌చ్చి నివాళుల‌ర్పించారు. దీనిపై మోహ‌న్ బాబు స్పందించారు. తన గురువు దర్శకుడు దాసరి నారాయణరావు చనిపోయినప్పుడు సినీ పరిశ్రమ సరిగా పట్టించుకోలేదన్నారు. గొప్ప వ్యక్తి - మేధావి అయిన దాసరి నారాయణరావుకు అంతిమ వీడ్కోలు సరిగా పలకలేదని విమర్శించారు. దాసరి మృతి వార్త తెలియగానే విజయవాడ నుంచి ప్రత్యేకంగా వచ్చి తన గురువుకు నివాళులర్పించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని అభినందించాలని ఆయ‌న అన్నారు.

అసలు తన గురువు దాసరి నారాయణరావుకు చంద్రబాబును మొట్టమొదట పరిచయం చేసిన ఘనత తనదేనని ఈ సందర్భంగా మోహన్ బాబు చెప్పారు. అప్ప‌ట్లో తిరుపతిలో ‘శివరంజని’ సినిమా ఫంక్షన్ జరిగినప్పుడు చంద్రబాబు ఎమ్మెల్యేగా ఉన్నారని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. చంద్రబాబు తనకు బంధువు - స్నేహితుడు కావడంతో అప్పుడు వేదికపై దాసరి పక్కనే చంద్రబాబును కూర్చోపెట్టించానని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/