Begin typing your search above and press return to search.
మోహన్ బాబును ఇలా ప్రశ్నలు అడగటం ఆర్కేకే సాధ్యమేమో?
By: Tupaki Desk | 4 Oct 2021 3:25 AM GMTఒక ప్రముఖ దినపత్రికలో పని చేసే ఒక సాదాసీదా కంట్రిబ్యూటర్.. ఏ స్థాయి వరకు ఎదగగలరు? పత్రికా రంగంలో ఎదగటం అంటే మాటలు కాదు. అలాంటిది కంట్రిబ్యూటర్ స్థాయి నుంచి తాను పని చేసిన దినపత్రిక ఎండీగా మారటం ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే అలియాస్ వేమూరి రాధాక్రిష్ణకు మాత్రమే సాధ్యమని చెప్పాలి. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. తెలుగునాట ఉన్న దినపత్రికల్లో ప్రముఖ దినపత్రికల యజమాని ఎవరూ ఎడిటోరియల్ వ్యాసాలు రాయటం.. నేరుగా రంగంలోకి దిగి ఇంటర్వ్యూలు లాంటివి చేయటం కనిపించదు. అందుకు భిన్నంగా ఆర్కే మాత్రం ప్రతి వారం.. ‘కొత్త పలుకు’ పేరుతో కాలమ్ రాస్తుంటారు.
గతంలో ఆపేసిన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే సీజన్ 3ను ఈ మధ్యనే మొదలుపెట్టారు. మొదటి ఎపిసోడ్ ను దివంగత మహానేత వైఎస్ కుమార్తె షర్మిలతో చేసిన ఆయన ఇంటర్వ్యూ ఆసక్తికరంగా మారింది. తాజాగా విలక్షణ నటుడు కమ్ ఫైర్ బ్రాండ్ మోహన్ బాబుతో చేసిన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే హాట్ టాపిక్ గా మారింది. ఇండస్ట్రీలో చాలామంది అగ్ర నటులు.. ప్రముఖులు ఉన్నా.. మిగిలిన వారంతా ఒక ఎత్తు. మోహన్ బాబు మరో ఎత్తు అన్న మాట వినిపిస్తూ ఉంటుంది. అలాంటి మోహన్ బాబును ముఖం మీదనే ఘాటు ప్రశ్నలు సంధించటం అంత తేలిక కాదు.
మోహన్ బాబును ప్రశ్నలు వేయటం ఒక ఎత్తు అయితే.. ఆయన కూడా అంతే టెంపర్ తో సంధించే సమాధానాల్ని జీర్ణించుకోవటం కూడా కష్టమే. కానీ.. ఆ పనిని ఆంధ్రజ్యోతి ఆర్కే విజయవంతంగా పూర్తి చేశారని చెప్పాలి. తాజాగా టెలికాస్ట్ అయిన ఇంటర్వ్యూలోని కొంత భాగాన్ని యథాతధంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే.. దాన్ని ఏ మాత్రం వేరుగా రాసినా.. ఆ టెంపో మిస్ కావటం ఖాయం. అందుకే.. ఆంధ్రజ్యోతి దినపత్రికలో పబ్లిష్ అయిన ఇంటర్వ్యూలోని కొంత భాగాన్ని ఉన్నది ఉన్నట్లు.. ఏ మాత్రం మార్పులు చేయకుండా ఇస్తున్నాం. ఈ తీరులోసాగిన ఇంటర్వ్యూను ఆర్కే మాత్రమే చేయగలరన్నట్లుగా ఉండటం దీని ప్రత్యేకతగా చెప్పక తప్పదు.
ఆర్కే: సీమ టపాకాయలా పేలే మోహన్‌బాబులో ఇంత వేదాంతం ఎలా వచ్చింది? బాగా దెబ్బలు
తగిలాయా?
మోహన్‌బాబు: తగిలాయి.
తగులుతున్నాయి.
ఆర్కే: నవ్వులు...
మోహన్‌బాబు: మీరు హ్యాప్పీగా నవ్వుతున్నారు. నేను నవ్వలేకపోతున్నాను. లోపల ఉన్న బాధ నవ్వనీయడం లేదు.
ఆర్కే: ఒరిజనల్‌గా ఉండే మోహన్‌బాబును కుంగదీసిందా...
మోహన్‌బాబు: అవును.
ఆర్కే: ఆర్థిక సమస్యలా.. లేక...
మోహన్‌బాబు: ఆర్థిక సమస్యలతో కుంగిపోవడం లేదు కానీ ఆర్థిక సమస్యలు వచ్చేటట్టు చేసిన వ్యక్తుల గురించి ఆలోచిస్తున్నాను. జీవితంలో ఒడుదొడుకులు ఓకే! సినిమా సక్సెస్ ఫెయిల్యూర్ ఓకే! భగవంతుని ఆశీస్సులతో, మీ అందరి ఆశీస్సులతో పిల్లలందరూ బాగున్నారు ఓకే!
ఆర్కే: మనుషులు సృష్టించిన కష్టాలు అవి...అంతేనా!
మోహన్‌బాబు: మా జీవితాల మీద దెబ్బకొట్టారు.
ఆర్కే: సినిమా జీవితమా? వ్యాపార జీవితమా?
మోహన్‌బాబు: సినిమా జీవితంపైన దెబ్బకొట్టడం ఎవ్వరి వల్లా కాదు. ఒక్క దేవుడి వల్ల మాత్రమే అవుతుంది.
ఆర్కే: మీ వ్యాపారం అంటే విద్యాసంస్థలు.. అంతేనా?
మోహన్‌బాబు: అంతే.
ఆర్కే: ఆంధ్రప్రదేశ్‌లో మీరు కోరుకున్న, మీ దగ్గరి బంధువు ముఖ్యమంత్రి అయ్యాడు. మీరు టిటిడి చైర్మన్ అవుతారని చాలా మంది అనుకున్నారు. అది పాయే! తీరాచూస్తే కాలేజీ గురించి గుక్కపట్టి ఏడుస్తున్నారు. ఎందుకు?
మోహన్‌బాబు: ఒకటి తప్పు మాట్లాడారు. నాకు చంద్రబాబు బంధువే. ఇతనూ బంధువే. మా అన్నయ్య రామారావును ఎలా ఇష్టపడతానో, రాజశేఖర్ రెడ్డిని కూడా అలాగే ఇష్టపడే వాణ్ణి.
చంద్రబాబుకు ప్రచారం చేశాం. అప్పుడూ ఏం అడగలేదు. ఈయనకూ ఒకసారి సపోర్టు చేద్దాం అని హృదయపూర్వకంగా చేశాం. మీరు ఏ దేవుడి మీద ప్రమాణం చేయమన్నా చేస్తాను. నేను ఏదీ ఆశించి చేయలేదు. ‘అది పోయింది’ అన్నారు. ఎక్కడికిపోయింది? వాళ్లకు కావాల్సిన వాళ్లకు ఇచ్చుకున్నారు. అది వాళ్లిష్టం. ముఖ్యమంత్రి ఇష్టం.
ఆర్కే: ఆంధ్రప్రదేశ్‌లో కాలేజీ ప్రమాణాలతో సంబంధం లేకుండా ఫీజులు నిర్ణయించడం వల్ల విద్యాసంస్థలన్నీ కుదేలవుతున్నాయి. అదే కదా సమస్య?
మోహన్‌బాబు: చెప్పండి!
ఆర్కే: ఎందుకలా బిక్కముఖం పెట్టారు?
మోహన్‌బాబు: బిక్కముఖం కాదు. మీరు నన్ను ఇబ్బందికరమైన విషయాలు అడగను అన్నారు.
మీరు అడిగిన దానికి ఒక విధంగా సమాధానం చెప్పాలంటే ముఖ్యమంత్రిని కొంతమంది ఐఏఎ్‌సలు అడ్డదారి పట్టిస్తున్నారు. ఐఏఎ్‌సలు, ఐపీఎ్‌సలు చదివిన్న వాళ్లందరూ మేధావులు కారు. విద్యాసంస్థల విషయంలో కొంతమంది ఐఏఎ్‌సలు రాంగ్ డైరెక్షన్ ఇవ్వడం వల్ల హయ్యర్ ఎడ్యుకేషన్ దెబ్బతిన్న మాట వాస్తవం.
ఆర్కే: జగన్‌మోహన్‌రెడ్డిని తప్పుదారి పట్టించడమా! జగన్‌మోహన్‌రెడ్డి ఎవరిమాటైనా వినడమా!
మోహన్‌బాబు: జగన్‌మోహన్‌రెడ్డి వినడని మీకు ఎవరు చెప్పారు.
ఆర్కే: నూటయాభై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా? వారిలో ఎవరిని అడిగినా చెబుతారు...
మోహన్‌బాబు: నేనెందుకు అడగాలి. నాకు, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి గొడవ పెట్టాలని చూస్తున్నారా? ఆయనకు నాకు పర్సనల్‌గా ఏమీ లేదు. కాలేజీల వ్యవహారంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. అది తప్పని చెప్పాం.
ఆర్కే: ఎవ్వరిని అడిగినా మాకు ముఖ్యమంత్రి దర్శనమే దొరకదు. ఒకవేళ దొరికినా ఆయన చెప్పింది విని రావడమే కానీ మేం చెప్పేది ఏమీ ఉండదు అని అంటారు.
మోహన్‌బాబు: అటు వెళ్లలేదు. వెళ్లదలుచుకోలేదు. ఆయన ముఖ్యమంత్రి కావాలనుకున్నాం.
అయ్యాడు.
ఆర్కే: మీకు నష్టమైతే జరిగిందన్న విషయాన్ని ఒప్పుకోగలరా?
మోహన్‌బాబు: ఏ విషయంలో...
ఆర్కే: మీ విద్యాసంస్థలకు న్యాయంగా నిర్ణయించాల్సిన ఫీజులను నిర్ణయించలేదు అని...
మోహన్‌బాబు: వాస్తవం.
ఆర్కే: ఇంకొకటి బకాయిలు..
మోహన్‌బాబు: బకాయిలు ఇస్తున్నారు. మీరు చంద్రబాబు మనిషా?
ఆర్కే: నేను ఎవ్వరి మనిషిని కాదు.
మోహన్‌బాబు: మరి ఎంతసేపు జగన్‌మోహన్‌రెడ్డి టాపిక్ ఎందుకు తీస్తున్నారు?
ఆర్కే: పులివెందులలో నాకు, జగన్‌మోహన్‌రెడ్డికి గట్టు పంచాయితీ ఉంది.
మోహన్‌బాబు: అది వేరు. నాకు సంబంధం లేదు.
ఆర్కే: నేననేది మోహన్‌బాబు అవుట్‌స్పోకెన్...
మోహన్‌బాబు: యస్. నో డౌట్.
ఆర్కే: చంద్రబాబు హయాంలో ఫీజుల చెల్లింపుల విషయంలో జాప్యం జరిగినప్పుడు ధర్నాలు చేశారా? లేదా?
మోహన్‌బాబు: వాస్తవం.
ఆర్కే: విద్యాసంస్థ అధిపతిగా అది మీ హక్కు. కానీ ఇప్పుడు అన్నీ మూసుకుని ఎందుకు కూర్చోవాల్సి వచ్చింది?
మోహన్‌బాబు: ఎవరు?
ఆర్కే: మీరని కాదు. మొత్తంగా... అందరికీ ముఖ్యమంత్రి అంటే భయమైతే ఉంది?
మోహన్‌బాబు: నో నెవర్! జీవితంలో భయపడాలి కానీ భయమే జీవితం కాకూడదు.
మరణించడానికి సిద్ధంగా ఉన్నవాడు ప్రాణాలను గడ్డిపరకలా చూస్తాడు. ఐ లవ్ హిమ్. ఐ రెస్పెక్ట్ హిమ్. ఎవడి మోచేతి నీళ్లయినా తాగుతున్నామా భయపడటానికి! చంద్రబాబు డిడ్ ఏ మిస్టేక్.
ఫీజులివ్వలేదు. ఎన్నోసార్లు ఫోన్లు చేశాం. ఇది వాస్తవం. బ్యాంకులకు డబ్బులు కట్టాలి. రెండు వేల మంది టీచింగ్, నాన్‌టీచింగ్ స్టాఫ్. వాళ్లందరికీ జీతాలు ఇవ్వాలి. రెండు రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ మాది. ప్రధానిని కలిసినప్పుడు కూడా అదే విషయం చెప్పా. ఆయన నన్ను బడా భయ్యా అని పిలుస్తారు. నేను ‘నో సార్’ అన్నాను చనువుగా.