Begin typing your search above and press return to search.

ప్రెస్ నోట్ రిలీజ్ స‌రే మోహ‌న్ బాబు..ఈ డౌట్ల మాటేంది?

By:  Tupaki Desk   |   2 April 2019 2:30 PM GMT
ప్రెస్ నోట్ రిలీజ్ స‌రే మోహ‌న్ బాబు..ఈ డౌట్ల మాటేంది?
X
సీనియ‌ర్ సినీ న‌టుడు.. ఇటీవ‌లే జ‌గ‌న్ పార్టీలో చేరిన మోహ‌న్ బాబుపై ఉన్న చెక్ బౌన్స్ కేసు నిరూపితం కావ‌టం.. ఆయ‌న‌కు ఏడాది జైలుశిక్ష విధిస్తూ ఎర్ర‌మంజిల్ కోర్టు తీర్పు ఇవ్వ‌టం ఎంత సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే. తీర్పు వెలువ‌డిన త‌ర్వాత జ‌రిగిన డ్యామేజ్ ను గుర్తించిన మోహ‌న్ బాబు వ‌ర్గీయులు న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టారు.

బెయిల్ కోసం ఏర్పాట్లు చేసి.. కోర్టు నుంచి రిలీఫ్ పొందారు.నెల రోజుల్లో కోర్టు పేర్కొన్న మొత్తాన్ని చెల్లిస్తే.. కేసు కొట్టి వేస్తామ‌న్న హామీని పొందారు. తాజాగా ఈ మొత్తం ఎపిసోడ్ పైన మోహ‌న్ బాబు ఒక ప్రెస్ నోట్ ను విడుద‌ల చేశారు. అందులో ఆయ‌న వైవీఎస్ చౌద‌రి కావాల‌నే త‌మ మీద చెక్ బౌన్స్ కేసు వేసిన‌ట్లుగా పేర్కొన్నారు.

ప్రెస్ నోట్ లో ఏముందంటే..

‘2009లో ‘సలీమ్‌’ సినిమా చేస్తున్న సమయంలో ఆ సినిమాకు కావాల్సిన మొత్తం పారితోషికాన్ని దర్శకుడు వైవీఎస్‌ చౌదరికి చెల్లించేశాం. మా బ్యానర్‌లోనే మరో సినిమా చేయడానికిగానూ ఆయనకు రూ.40 లక్షల చెక్‌ ఇచ్చాం. ‘సలీమ్‌’ అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడంతో చౌదరితో చేయాల్సిన మరో సినిమాను వద్దనుకున్నాం.

సినిమా చేయడం లేదని చౌదరికి చెప్పాం. చెక్‌ను బ్యాంక్‌లో వేయొద్దని కూడా చెప్పాం. అయినా కూడా కావాలనే చెక్‌ను బ్యాంక్‌లో వేసి బౌన్స్‌ చేశారు. నాపై చెక్‌ బౌన్స్‌ కేసు పెట్టి కోర్టును తప్పుదోవ పట్టించారు. దాంతో వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ తీర్పుని సెషన్స్‌ కోర్టులో ఛాలెంజ్‌ చేస్తున్నాం. కొన్ని వార్తా ఛానల్స్‌లో మాపై వస్తున్న తప్పుడు ఆరోపణలను నమ్మొద్దు’

మోహ‌న్ బాబు సారు రిలీజ్ చేసిన ప్రెస్ రిలీజ్ లోని అంశాల‌కు సంబంధించి కొన్ని సందేహాల‌కు స‌మాధానం ఎవ‌రు చెబుతార‌న్న మాట వినిపిస్తోంది.

+ ప్రెస్ నోట్ లో పేర్కొన్న అంశాల్ని కోర్టులో కూడా చెప్పి ఉంటారు క‌దా? మ‌రి.. కోర్టు మోహ‌న్ బాబు మాట‌ను ఎందుకు విశ్వ‌సించ‌లేదు?

+ ప్రెస్ నోట్ లో చెప్పిన అంశాల‌కు సంబంధించిన సాక్ష్యాల్ని కోర్టులో స‌మ‌ర్పించారా?

+ కోర్టులో బెయిల్ తీసుకొని బ‌య‌ట‌కు వ‌చ్చాక‌.. త‌మ‌కు వ్య‌తిరేకంగా వ‌చ్చిన తీర్పును ఇలా వ్యాఖ్య చేయొచ్చా?

+ ఇండ‌స్ట్రీలో సీనియ‌ర్ గా పేరున్న నేప‌థ్యంలో.. గ‌డిచిన కొన్నేళ్లుగా ఈ వివాదాన్ని ఎందుకు ప‌రిష్క‌రించుకోలేక‌పోయారు?

+ కోర్టును త‌ప్పుదారి ప‌ట్టించ‌టంతో తీర్పు వారికి అనుకూలంగా వ‌చ్చింద‌న్న వ్యాఖ్య‌నే తీసుకుంటే.. త‌ప్పు దారి ప‌ట్టించార‌న‌టానికి మోహ‌న్ బాబు వ‌ద్ద ఆధారాలు ఉన్నాయా? ఉంటే.. ప్రెస్ రిలీజ్ తో పాటు వాటిని కూడా విడుద‌ల చేస్తే స‌రిపోయేది క‌దా?