Begin typing your search above and press return to search.

మోహ‌న్‌బాబు సంచ‌ల‌న కామెంట్లు

By:  Tupaki Desk   |   4 April 2015 5:33 PM GMT
మోహ‌న్‌బాబు సంచ‌ల‌న కామెంట్లు
X
యాంగ్రీ యంగ్‌మెన్ మోహ‌న్ బాబు సంచ‌ల‌న కామెంట్లు చేశారు. సెల‌వుల కోసం గోవా వెళ్లిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి షాపింగ్ చేస్తున్న స‌మ‌యంలో ట్రయల్ రూమ్‌కు వెళ్లిన ఆమె అందులో ఒక రహస్య సీసీ కెమెరాను గుర్తించిన విష‌యం, అది మ‌హిళ‌ల‌ను తీవ్రంగా గాయ‌ప‌ర్చేలా ఉన్న విష‌యం తెలిసిందే. ఈ సంఘ‌ట‌న‌పై మోహ‌న్ బాబు స్పందించారు.

వ‌స్త్ర దుకాణంలో కెమెరాలు పుట్టిన వారు దుర్మార్గుల‌ని మండిప‌డ్డారు. ఎవరైతే ఈ ఘోరం చేశారో ఆ దుర్మార్గుల అమ్మ కూడా ఒక స్త్రీయేనని గుర్తుంచుకోవలని వ్యాఖ్యానించారు. ఆ చర్యకు పాల్పడినవారిని వదిలిపెట్టకూడదని, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. స్త్రీ అభ్యున్నతి మనందరి బాధ్యత అని మోహ‌న్ బాబు పేర్కొన్నారు. సోషల్ మీడియా ద్వారా మోహన్ బాబు తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

గోవాలో 'ఫ్యాబ్ ఇండియా షోరూమ్‌లో కొనుగోలు చేసిన దుస్తుల‌ను వేసుకుని చూసేందుకు స్మృతి ఇరానీ ట్రయల్ రూమ్ కు వెళ్లారు. ఆ రూమ్ వెంటిలేటర్‌పై ర‌హ‌స్య కెమెరాను అమ‌ర్చిన విష‌యం గ‌మ‌నించారు. దీనిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన అనంత‌రం ప‌లు దిగ్భ్రాంతిక‌ర విష‌యాలు వెలుగు చూశాయి. నాలుగు నెలల కింద ఈ రహస్య కెమెరాను అమర్చినట్లుగా సిబ్బంది చెప్పినట్లు తేలింది. మేనేజర్ గదిలోని కంప్యూటర్‌లో దృశ్యాలన్నీ రికార్డు అవుతాయని గుర్తించారు. ఎంతో మంది దుస్తులు మార్చుకుంటున్న దృశ్యాలు అందులో ఉంటాయని ద‌ర్యాప్తులో తేల్చారు.