Begin typing your search above and press return to search.
మోహన్ బాబు ఫస్ట్ టార్గెట్ .. చినబాబేనట!
By: Tupaki Desk | 30 March 2019 5:36 AM GMTసినీ నటుడు.. మాజీ రాజ్యసభ సభ్యుడు మోహన్ బాబు మళ్లీ వార్తల్లోకి వచ్చేశారు. రానున్న రోజుల్లో ఆయన పేరు ఏపీ రాజకీయాల్లో మారు మోగిపోవటం ఖాయమంటున్నారు. మంచి వాగ్దాటి.. మాటలతో మంట పుట్టించే లక్షణం ఆయనకు ఎక్కువే. ఆయన మాట తీరు ఎలా ఉంటుందో తెలుగు ప్రజలకు తెలియనిది కాదు.
ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన.. ఈ రోజు (శనివారం) నుంచి ఏపీలో ఎన్నికల ప్రచారాన్ని చేపడుతున్నారు. ఆయన తన తొలి ఎన్నికల ప్రచారాన్ని మంగళగిరి నుంచి స్టార్ట్ చేయటం ఆసక్తికరంగా మారింది. ఇటీవల కాలంలో జగన్ పార్టీ నేతలు పలువురు మంగళగిరి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు.
ఈ నియోజకవర్గం నుంచి ఏపీ సీఎం కుమారుడు కమ్ ఏపీ మంత్రి లోకేశ్ బరిలో నిలవటంతో అందరి దృష్టి ఈ నియోజకవర్గం మీదనే ఉంది.
తన మాటలతో ఇప్పటికే మంగళగిరి వాసులకు చుక్కలు చూపిస్తున్న లోకేశ్ పై భారీగా జోకులు ఈ నియోజకవర్గంలో వినిపిస్తున్నాయి. లోకేశ్ మాట్లాడే తీరు సరిగా లేకపోవటం.. ఆయన మాటల్లో దొర్లే తప్పులు.. నాలుక జారేలా వ్యాఖ్యలు చేయటంతో చినబాబు నవ్వుల పాలయ్యారని చెప్పక తప్పదు. లోకేశ్ ప్రసంగాలతో టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఆయన నోరు తెరిచి నాలుగు మాటలు చక్కగా మాట్లాడలేకపోవటాన్ని ఎలా కవర్ చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
ఇలాంటివేళ.. మోహన్ బాబు లాంటి సినీ ప్రముఖులు.. వాగ్ధాటి ఉన్న వారు ఎన్నికల ప్రచార బరిలోకి దిగితే చినబాబుకు చుక్కలు ఖాయమంటున్నారు. గతంలో కొంతకాలం టీడీపీ తరఫున ప్రచారం చేసిన మోహన్ బాబు.. ఈసారి అందుకు భిన్నంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయటంతో ఆయన చేసే వ్యాఖ్యలపై ఉత్కంట నెలకొంది. మంగళగిరిలో తన ప్రచారాన్ని ప్రారంభించటం ద్వారా అందరి దృష్టిని తన వైపునకు తిప్పుకునేలా చేశారని చెప్పాలి.
అంతేకాదు. ఏపీ ప్రభుత్వ వైఫల్యం గురించి.. పథకాల పేరుతో చేసే మాయను బయటపెట్టటంతో పాటు.. మంత్రిగా లోకేశ్ పని తీరును.. చంద్రబాబును.. ఆయన పాలనా విధానంపైనా మోహన్ బాబు మండిపడే అవకాశం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. వాడీవేడి ప్రసంగాలతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించేలా మోహన్ బాబు మాటలు ఉండనున్నట్లుగా తెలుస్తోంది.