Begin typing your search above and press return to search.
నేనా టీటీడీ ఛైర్మనా... పుకార్లు నమ్మొద్దు
By: Tupaki Desk | 5 Jun 2019 8:41 AM GMTఏపీలో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక... అన్ని పెండింగ్ పనులు చకచకా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనేక కొత్త బోర్డులు ఏర్పాటు చేశారు. అధికారుల బదిలీలు చేశారు. పాలనలో ప్రక్షాళన కోసం అన్ని స్థాయిల్లో సమూల మార్పులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల జగన్ కు మద్దతుగా నిలబడిన మోహన్ బాబుకు కొత్తగా ఏర్పాటు చేసే టీటీడీ బోర్డు ఛైర్మన్ పదవి ఇస్తారని వార్తలు వచ్చాయి. వాస్తవానికి అవి వార్తలు కాదు - గాసిప్స్. ఈ విషయాన్ని స్వయంగా మోహన్ బాబే వివరించి - ఖండించారు.
''తితిదే ఛైర్మన్ పదవి రేసులో నేనున్నానని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయమై గత కొన్నిరోజులుగా నాకు ఫోన్లు కూడా వస్తున్నాయి. నా కోరిక ఒక్కటే.. జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నాను. ఆయన చేసే ప్రజాసేవకు నా వంతు సహకారం అందించాలని అనుకున్నాను. జగన్‌పై ఉన్న నమ్మకంతోనే మళ్లీ రాజకీయాల్లోకి వచ్చాను. అంతేకానీ ఎలాంటి పదవులు ఆశించి రాలేదు. మీడియా వారు దయచేసి ఇలాంటి వదంతులు పుట్టించొద్దని కోరుతున్నా'' అని మోహన్ బాబు ట్వీట్ లో పేర్కొన్నారు మోహన్ బాబు.
తన స్పందనతో అన్ని గాసిప్స్ కు చెక్ పెట్టారు మోహన్ బాబు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచే వైఎస్ ఫ్యామిలీతో మంచు కుటుంబానికి సంబంధాలున్నాయి. ఒకరకంగా దూరపు బంధువులు కూడా. నానాటికీ చంద్రబాబు తీసికట్టు పాలనపై విసిగిపోయిన మోహన్ బాబు... చివరకు పిల్లల కాలేజీ ఫీజులు కూడా ఇవ్వడం లేదని తెలిసి బహిరంగంగా ధర్నాకు దిగారు. పాలన చేతకాకపోతే దిగిపోవాలి కాని విద్యార్థులతో ఆడుకోకూడదన్నారు.
వీటన్నింటి నేపథ్యంలో గాసిప్ రాయుళ్లు... మోహన్ బాబు చుట్టూ వార్తలు అల్లేశారు. ఇప్పటికే మోహన్ బాబు హైదరాబాద్ లోని ఫిలింనగర్ దైవసన్నిధానం ఆలయం చైర్మన్ గా కొనసాగుతుండటం - వైఎస్ కుటుంబానికి మంచు విష్ణు వియ్యంకుల తరఫున సంబంధాలుండటం వంటి అనేక ఆధారాల నేపథ్యంలో ఈ గాసిప్ వైరల్ అయ్యింది. చివరకు ఇది శృతిమించకుండా మోహన్ బాబు స్వయంగా చెక్ పెట్టారు. మంచి పరిపాలన కోసం జగన్ ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నానే గాని నా పదవుల కోసం కాదని ఆయన స్పష్టంగా తేల్చేశారు.