Begin typing your search above and press return to search.

మోడీకి ఇంకో త‌ల‌నొప్పి వ‌ద్దంటున్న పెద్దాయ‌న‌

By:  Tupaki Desk   |   30 Sep 2017 10:24 AM GMT
మోడీకి ఇంకో త‌ల‌నొప్పి వ‌ద్దంటున్న పెద్దాయ‌న‌
X
ద‌స‌రా సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి కీల‌క సూచ‌న ఒక‌టి ప్ర‌ముఖుడి నుంచి వ‌చ్చింది. అంత‌ర్జాతీయంగా చ‌ర్చ‌నీయాంశం, అందులోనూ భార‌త‌దేశానికి సంబంధించిన ముఖ్య‌మైన అంశంపై బీజేపీ మాతృక అయిన ఆర్‌ ఎస్‌ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ముఖ్య సూచ‌న చేశారు. దసరా పండుగ సందర్భంగా పుణెలో మోహన్ భగవత్ ఆర్‌ ఎస్‌ ఎస్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. అంతకు ముందు అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన.. గోసంరక్షణ - దేశ భద్రత - ముంబై ఎల్ఫిన్‌ స్టోన్ రైల్వేస్టేషన్‌ లో ప్రమాదంపై మాట్లాడారు. ముందుగా రైల్వేస్టేషన్‌ లో తొక్కిసలాట జరిగి ప్రాణాలు కోల్పోయిన వారికి మోహన్ భగవత్ నివాళులర్పించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

రోహింగ్యా ముస్లిం శరణార్థులను దేశంలోకి రానివ్వ‌డం కంటే ముందు దేశ భద్రత గురించి ఆలోచించాలని కేంద్రానికి మోహన్ భగవత్ సూచించారు. భారత్‌ లోకి వస్తున్న బంగ్లాదేశీ శరణార్థుల కారణంగా ఇప్పటికే దేశం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటుందన్న మోహన్ భగవత్.. రోహింగ్యాల విషయంలో దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలన్నారు. మయన్మార్ నుంచి వచ్చే రోహింగ్యాల అక్రమ చొరబాటును ఆపేందుకు యత్నించాలని భగవత్ సూచించారు. రోహింగ్యాలను గుర్తించాలని కేంద్ర హోంశాఖ ఆగస్టు నెలలో అన్ని రాష్ర్టాలకు నోటీసులు జారీ చేసిన విషయం విదితమే.ఈ నేప‌థ్యంలో భ‌గ‌వత్ వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి.

ఆవు ఒక మతానికి సంబంధించింది కాదన్న మోహ‌న్ భ‌గ‌వత్‌.. ఎంతో మంది ముస్లింలు ఆవులను పెంచి పోషిస్తున్నారని తెలిపారు. ఈ విష‌యాన్నిగ‌మ‌నించ‌కుండా కొందరు విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఆవుల రక్షణ కోసం ముస్లింలు ప్రాణాలు కూడా అర్పించారన్నారు. అంతే కాదు ఆవులను దొంగ రవాణా చేసే వారి చేతుల్లో కూడా గోసంరక్షకులు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారన్న విషయాన్ని గుర్తించాలని భ‌గ‌వత్ కోరారు. గోసంరక్షకులపై వెస్ట్ బెంగాల్ - కేరళ ప్రభుత్వాలు ప్రవర్తిస్తున్న తీరుపై మోహన్ భగవత్ ధ్వజమెత్తారు. గోసంరక్షణ పేరిట కొంతమంది హత్యలకు పాల్పడుతున్నారని, వారికి ప్ర‌భుత్వాలు స‌హ‌క‌రించ‌డం స‌రికాద‌ని చెప్పారు.