Begin typing your search above and press return to search.
బీటెక్ తో జాబులు కష్టమే అంటున్న టెక్ పెద్దాయన
By: Tupaki Desk | 8 Jun 2017 4:23 PM GMTఐటీ సెక్టార్ లో ఎప్పుడెప్పుడు ఏం మార్పులు జరుగుతుంటాయో ఎవ్వరూ ఊహించలేరు. టెక్నాలజీలు కూడా రోజు రోజుకూ మారుతుంటాయి. ఒకే టెక్నాలజీ మీద కొన్నేళ్లు వర్క్ చేయాలన్నా కుదరదు. కొత్త కొత్త టెక్నాలజీలను ఎప్పటికప్పుడు అంది పుచ్చుకుంటూ ఉండాలి. ఐటీ సెక్టార్ లో ఎక్కువగా ఉండేది బీటెక్ గ్రాడుయేట్లే. ప్రస్తుతానికి ఓకే కాని.. భవిష్యత్తులో ఒక్క బీటెక్ డిగ్రీ మాత్రమే ఉంటే ఐటీ జాబ్స్ కొట్టడం కష్టమేనని ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ ఓ - హెచ్ ఆర్ హెడ్ టీవీ మోహన్ దాస్ పాయ్ అన్నారు. మోహన్ దాస్ ప్రస్తుతం నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లోని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో మెంబర్ గా ఉన్నారు.
తాజాగా మీడియాతో మాట్లాడిన మోహన్ దాస్ పాయ్....చాలా మంది స్టూడెంట్స్ కు ఆయన ఓ సలహా కూడా ఇచ్చారు. కేవలం బీటెక్ మాత్రమే చదవకండి. ఏదో ఒక స్పెషలైజేషన్ తో ఎంటెక్ కూడా చేయండి. కోడింగ్ పరిజ్ఞానాన్ని పెంచుకోండి. భవిష్యత్తులో కంపెనీలు కోడింగ్ నాలెడ్జ్ ను పరిగణనలోని తీసుకొనే రిక్రూట్ చేసుకుంటాయని ఆయన వివరించారు. కాలేజీలు విద్యార్థుల్లో కోడింగ్ నాలెడ్జ్ పెంపొందించేలా పాఠాలు చెప్పాలన్నారు. ఇప్పటిలా ఫ్రెషర్స్ ను రిక్రూట్ చేసుకొని... ఓ ఆరు నెలలు ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు ప్రాజెక్ట్స్ మీద కూర్చోబెట్టే పద్ధతికి త్వరలోనే కార్పోరేట్ కంపెనీలు మంగళం పాడనున్నాయన్నారు. ఇక కంపెనీలు ప్రెషర్స్ పై టైమ్ వేస్ట్ చేయదలచలేదని.. కోడింగ్ పరిజ్ఞానం ఉన్న వారినే తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాయన్నారు.
గత రెండు దశాబ్దాల నుంచి ఫ్రెషర్స్ సాలరీస్ అంత ఆశాజనకంగా లేవని.. ఐటీ ఇండస్ట్రీకే ఇదో పెద్ద ట్రాజడీ అని ఆయన అబివర్ణించారు. దీనికి కారణం ఐటీ ఇండస్ట్రీలో వచ్చే ఆటుపోట్లేనన్నారు. అంతే కాకుండా... ఇండస్ట్రీలో సప్లై పెరిగిపోయి.. డిమాండ్ తగ్గిందన్నారు. ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ డిగ్రీ పాసయ్యే వాళ్లు ఇండియాలో దాదాపు 10 లక్షల మంది అని.. అంత మందికి జాబ్స్ ఇవ్వగలిగే సామర్థ్యం ఏ దేశ ఎకానమీకి కూడా ఉండదని మోహన్ దాస్ పాయ్ తేల్చిచెప్పారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/