Begin typing your search above and press return to search.

ఉప్పే పెట్రోలు

By:  Tupaki Desk   |   5 Feb 2017 5:47 AM GMT
ఉప్పే పెట్రోలు
X
అవును.. మీరు, కరెక్టుగానే చదివారు. అది ఉప్పే ఇంకేం కాదు. అయితే మాత్రం, ఇంకేం కాకపోయినా, ఉప్పయినా అది పెట్రోలులా ఎలా పనిచేస్తుందని డౌటు వచ్చేసింది కదా. అస్సలు డౌటు పడొద్దు. నిజంగా ఆ కారుకు ఉప్పే ఇంధనం. జర్మనీకి చెందిన ఓ సంస్థ రూపొందించిన కారు నడవడానికి ఉప్పే కీలకంగా పనిచేస్తోంది.

గంట‌కు 300 కిలోమీట‌ర్ల వేగంతో దూసుకెళ్లే ఈ కారు పూర్తిగా విద్యుత్‌ తో ప‌నిచేస్తుంది. త‌న‌కు కావాల్సిన విద్యుత్‌ ను అదే త‌యారు చేసుకుంటుంది. కాక‌పోతే కొంచెం ఉప్పు వేయాలి అంతే! జ‌ర్మ‌నీకి చెందిన నానో ఫ్లోసెల్ అనే కంపెనీ దీనిని అభివృద్ధి చేస్తోంది. వ‌చ్చే నెల‌లో జ‌ర‌గ‌నున్న జెనీవా ఇంట‌ర్నేష‌న‌ల్ మోటార్ షోలో 48 వోల్ట్ పేరుతో ఈ కారును ప్ర‌ద‌ర్శించ‌నున్నారు.

కారులో బ్యాట‌రీల‌కు బ‌దులు ఫ్యూయ‌ల్ సెల్స్‌ను ఉప‌యోగించారు. ఉప్పు - ఇత‌ర ర‌సాయ‌నాల‌ను అందులో వేస్తున్నంత కాలం అది పరుగులు పెడుతూనే ఉంటుందన్న మాట‌. జెట్ స్పీడుతో ప్ర‌యాణించే ఈ కారు 2.44 సెక‌న్ల‌లోనే 100 కిలోమీట‌ర్ల వేగాన్ని అందుకోగల‌గ‌డం మ‌రో ప్రత్యేక‌త‌. మరి దీన్ని మార్కెట్లోకి తెస్తారో లేదో.. తెస్తే ధర ఎంత అన్నది మాత్రం కంపెనీ ఇంకా ప్రకటించలేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/