Begin typing your search above and press return to search.

అమ్మను బతికించిన డాక్టర్ ఆ పురిటిబిడ్డే..

By:  Tupaki Desk   |   19 Sep 2015 6:41 AM GMT
అమ్మను బతికించిన డాక్టర్ ఆ పురిటిబిడ్డే..
X
తల్లీబిడ్డల అనుబంధం ఎలాంటిదే అందరికీ తెలిసిందే.. ఆ బంధానికి ఉన్న మహత్తును రుజువు చేసిన సంఘటన ఒకటి అమెరికాలో జరిగింది. కోమాలోకి వెళ్లిన తల్లి పాప ఏడుపుతో స్పృహలోకి రావడంతో వైద్యులు కూడా ఆశ్యర్యపోతున్నారు. మృత్యువు అంచుల వరకు వెళ్లిన ఆ తల్లిని పాప ఏడుపే రక్షించిందని చెబుతున్నారు.

అమెరికాలోని ఉత్తర కరోలినాలోని షెల్లీ అనే మహిళకు సిజేరియన్ చేయగా పాప జన్మించింది. అయితే.. ఆపరేషన్ తరువాత షెల్లీ ఆరోగ్యం విషమించి ఆమె కోమాలోకి వెల్లింది. ఆమెను స్పృహలోకి తెచ్చేందుకు డాక్టర్లు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. దీంతో ఆమె చనిపోతుందని డాక్టర్లు చెప్పేశారు కూడా. అయితే... డాక్టర్లు చేతులెత్తేసినా అక్కడున్న సీనియర్ నర్సు మాత్రం ఆశలు వదులుకోలేదు. తల్లీబిడ్డల మధ్య ఉండే స్పర్శానుభూతుల వల్ల కలిగే ప్రయోజనాలను డాక్లర్లకు గుర్తుచేసింది. వెంటనే పాపను తల్లి చెంతకు తెచ్చారు. బిడ్డ స్పర్శ తగిలేలా తల్లి గుండెలపై పడుకోబెట్టారు. పాపను... మెల్లగా గిల్లడంతో ఏడవడం ప్రారంభించింది... కాసేపటికి ఆ ఏడుపు విని షెల్లీ కోమా నుంచి బయటపడింది. స్పృహలోకి వచ్చి తనకు తానుగా బిడ్డను చేతుల్లోకి తీసుకుని ముద్దాడింది.

... అయితే... ఇది ఈనాటి సంగతి కాదు.. ఏడాది కిందటే ఈ అరుదైన సంఘటన జరిగినా అప్పటి ఘటనకు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న వైద్యులు తాజాగా ఆ వీడియో ఫుటేజిలను సోషల్ మీడియాలో ఉంచారు. దీంతో ఈ గొప్ప మమతానురాగ వైద్యం ప్రపంచానికి తెలిసింది. సోషల్ మీడియాలో దీనికి షేర్లే షేర్లు.