Begin typing your search above and press return to search.
మరో సూసైడ్ చాలెంజ్ 'మోమో'!
By: Tupaki Desk | 18 Aug 2018 12:23 PM GMTగత ఏడాది బ్లూ వేల్ గేమ్ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయిన సంగతి తెలిసిందే. సరదాగా మొదలు పెట్టే ఈ వికృత క్రీడ చివరకు యువత ప్రాణాలు తీసేదాకా వదలదు. రష్యాలో మొదలైన ఆ గేమ్...ప్రపంచ వ్యాప్తంగా వందలాది మందిని ఆత్మహత్యలకు ప్రేరేపించిన సంగతి తెలిసిందే. ఆ గేమ్ భారత్ కు కూడా వ్యాపించడంతో దాని వెబ్ సైట్లను కేంద్రం నిషేధించింది. ఆ తర్వాత ఆ గేమ్ నిర్వహించే వ్యక్తిని రష్యా పోలీసులు అరెస్టు చేయడంతో ఆ వ్యవహారం సద్దుమణిగింది. అయితే, ఇపుడు తాజాగా అదే తరహాలో `మోమో` చాలెంజ్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఫేస్ బుక్ లో మొదలైన ఈ పైశాచిక ఆన్ లైన్ చాలెంజ్...ఆ తర్వాత వాట్సాప్ - యూట్యూబ్ లకు పాకింది. అర్జెంటీనాలో ఓ 12 ఏళ్ల బాలిక ఈ చాలెంజ్ బారిన పడి ఆత్మహత్యకు పాల్పడడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో, భారత్ లో ఈ చాలెంజ్ పై అవగాహన కల్పించేందుకు ముంబై పోలీసులు నడుం బిగించారు.
మోమో చాలెంజ్....దాదాపుగా బ్లూ వేల్ తరహాలోనే ఉండే ఈ గేమ్.....చిన్న పిల్లలు - టీనేజర్స్ ను ఎక్కువగా టార్గెట్ చేస్తుంది. వాస్తవానికి ఇది ఒక సోషల్ మీడియా అకౌంట్. ఫేస్ బుక్ గ్రూపులలోని ఒక అన్ నోన్ నంబర్ కు మీరు కాల్ చేయాలంటూ యూజర్లకు ఆ అకౌంట్ చాలెంజ్ విసురుతుంది. గుడ్లు బయటపెట్టి భయంకరంగా చూస్తోన్న ఓ ఆడపిల్ల బొమ్మ ఫొటో...ఈ మోమో చాలెంజ్ లో దర్శనమిస్తుంది. ఆ నెంబర్ కు కాల్ చేయగానే ...రకరకాల టాస్క్ లు పూర్తి చేయాలంటూ యూజర్ ను మోమో ప్రేరేపిస్తుంది. ఆ టాస్క్ లను పూర్తి చేస్తే మోమోను కలవచ్చంటూ ఆశచూపుతుంది. ఆ క్రమంలో అనేక హింసాత్మకమైన టాస్క్ లు పూర్తి చేయాలంటూ యూజర్లను ఎంకరేజ్ చేస్తుంది. చివరకు ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తుంది. ఒక వేళ ఎవరన్నా ఈ చాలెంజ్ ను పూర్తి చేసేందుకు నిరాకరిస్తే.....భయంకరమైన - హింసాత్మకమైన ఫొటోలను యూజర్లకు పంపుతుంది. అయితే, ఈ మోమో చాలెంజ్ బారిన పడి తాజాగా అర్జెంటీనాలోని 12 ఏళ్ల బాలిక మృతిచెందడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. జపాన్ - మెక్సికో - కొలంబియాలలో ఈ మోమో అకౌంట్ కు సంబంధించిన నంబర్లను పోలీసులు గుర్తించి విచారణ చేపట్టారు.
అయితే, ఇప్పటివరకు భారత్ లోకి ఈ చాలెంజ్ ప్రవేశించినట్లు ఎటువంటి సమాచారం లేదు. అయితే, గతంలో భారత్ లోకి బ్లూవేల్ ప్రవేశించిన దృష్ట్యా....ముంబై పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. సోషల్ మీడియా వాడకం ఎక్కువైన ఈ రోజుల్లో....భారత్ లోకి మోమో ప్రవేశించడం అసాధ్యం కాదని పోలీసులు భావిస్తున్నారు. అందుకే, సోషల్ మీడియాను విరివిగా ఉపయోగించే పిల్లలకు...వారి తల్లిదండ్రులకు మోమోపై అవగాహన కల్పిస్తున్నారు. మోమో చాలెంజ్ అంటూ ఆన్ లైన్ లో వాట్సాప్ లో ఎవరన్నా కాంటాక్ట్ చేస్తే తమకు సమాచారమివ్వాలని ముంబై పోలీసులు ట్వీట్ చేశారు. నేపాల్ లో ప్రఖ్యాత వంటకం `మోమో`ను....ప్రచారం కోసం పోలీసులు ఉపయోగించారు. అన్ని మోమోలు తినడానికి వీలుగా ఉండవు ....అంటూ భయంకరమైన మోమో పిక్ ను పోలీసులు ట్వీట్ చేశారు. సే నోనో టు మోమో అంటూ క్యాప్షన్ పెట్టారు. తమ పిల్లల ప్రవర్తనలో వచ్చే మార్పులను తల్లిదండ్రులు గమనించాలని పోలీసులు కోరారు.