Begin typing your search above and press return to search.
ఎన్నికల్లో పట్టుకున్న డబ్బు..ఏపీకి రికార్డ్
By: Tupaki Desk | 21 May 2019 9:38 AM GMTఅధికారం కోసం నేతలు ఎంతైనా ఖర్చు చేస్తారు. చేతికి ఎముకే లేకుండా ఉదారంగా పంచుతుంటారు. ఈ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కో నియోజకవర్గంలో గెలవడానికి 50 కోట్లు కూడా ఖర్చు పెట్టిన నేతలు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అలా దేశవ్యాప్తంగా నగదును ఏరులై పారించారు.
అయితే ఎన్నికల సంఘం - పోలీసులు కూడా పెద్ద మొత్తంలో డబ్బు - మద్యం - బహుమతుల పంపిణీని అరికట్టారు. వందల కోట్ల నగదును - మద్యంను పట్టుకున్నారు. అలా లెక్క తీయగా ఏపీలో కళ్లు చెదిరే రీతిలో నగదు దొరకడం విశేషం.
ఈ ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ లో పట్టుకున్న సొమ్ము 216.34కోట్లుగా ఈసీ ప్రకటించింది. దేశం మొత్తం మీద ఈ ఎన్నికల వేళ 2628 కోట్ల నగదును ఈసీ స్వాధీనం చేసుకుంటే ఏపీలో స్వాధీనం చేసుకున్న సొమ్ము అందులో పది శాతంగా ఉండడం విశేషం. 2014 ఎన్నికల్లో 141.13 కోట్లు పట్టుకున్నామని.. ఈసారి 75కోట్లు అదనంగా దొరికిందని ఈసీ తెలిపింది. ఇంత దొరికినా దొంగచాటుగా మన నేతల వందల కోట్లు పంచారు. పైపైన చెక్ చేస్తేనే ఇంత దొరికితే ఇక సీరియస్ గా చెక్ చేస్తే ఎన్నికోట్లు దొరుకుతుందోనని విమర్శలు దెప్పిపొడుస్తున్నారు..
ఏపీలో స్వాధీనం చేసుకున్న రూ.216.34 కోట్ల లో ధనం - వస్తువులు - మద్యం ఉన్నాయి. 26.31 కోట్లు విలువైన 6.70 లక్షల లీటర్ల మద్యంను సీజ్ చేశారు. విశాఖ ఏజెన్సీ నుంచి తరలిస్తున్న రూ.50 లక్షల విలువైన గంజాయి కూడా ఉంది.
ఇక ఏపీలోనే పక్క రాష్ట్రాలైన తెలంగాణ - తమిళనాడులో కూడా డబ్బు ఏరులై పారింది. ముఖ్యంగా ఏపీని మించి తమిళనాడులో డబ్బు బాగా దొరికింది. తమిళనాడులో మొత్తం రూ.514 కోట్లు పట్టుబడింది. తెలంగాణలో రూ.77.49 కోట్లను సీజ్ చేశారు. దక్షిణాదిలో అత్యధిక సొమ్ము పట్టుబడిన రాష్ట్రంగా తమిళనాడు నిలవడం విశేషం.