Begin typing your search above and press return to search.
అసెంబ్లీ ఎన్నికలు: డబ్బు - మద్యం - బంగారం - మాఫియా
By: Tupaki Desk | 19 April 2018 10:04 AM GMTఅసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కర్ణాటకలో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆ రాష్ట్రంలో డబ్బు - మద్యం విచ్చలవిడిగా ప్రవహిస్తున్నాయి. రాష్ట్రంలో పలుచోట్ల భారీగా నగదు - మద్యం పట్టుబడుతున్నాయి. నకిలీ నోట్లు - మాదక ద్రవ్యాలు - బంగారం - వెండి కూడా పట్టుబడడం ఆశ్చర్యకరం. అదే సమయంలో మైనింగ్ మాఫియాకు అగ్రతాంబూలం దక్కుతోందని అంటున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల జాబితా చూస్తే… కళంకితులైనా సరే గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని బీజేపీ - కాంగ్రెస్ పార్టీలు నిర్ణయించినట్లు స్పష్టంగా కన్పిస్తోంది. ఒకరు మైనింగ్ మాఫియా వైపు మొగ్గుచూపితే పోటీగా అదే మాఫియాకు సీట్లు ఇచ్చింది ప్రత్యర్థి పార్టీ. వరుస చూస్తుంటే ఎంత అధిక అవినీతి పరుడైతే.. గెలుపు ఛాన్స్ మీటర్ అదే స్థాయిలో పెరుగుందని కాంగ్రెస్ - బీజేపీ భావిస్తున్నాయని అంటున్నారు.
మే 12న జరిగే ఎన్నికలకుగాను బీజేపీ 154 మందితో తొలి జాబితా ప్రకటిస్తే.. కాంగ్రెస్ ఒకేసారి 218 మందితో తొలి జాబితా ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ మైనింగ్ మాఫియాగా పేరొందిన ఆనంద్ సింగ్ - సతీష్ సెయిల్ - నాగేంద్రలకు టికెట్లు ఇవ్వగా… బీజేపీ ఏకంగా గాలి జనార్ధన్ రెడ్డి గ్యాంగ్ కు అగ్రతాంబూలం ఇచ్చింది. దాదాపు మూడు జిల్లాల్లో మెజారిటీ సీట్లు గాలి చెప్పినవారికే ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. గాలికి సీటు ఇవ్వకున్నా… ఆయన సోదరుడు గాలి సోమశేఖర్ రెడ్డికి టికెట్టు ఇవ్వడమేగాక…ఆయన ముఖ్య అనుచరుడు బి. శ్రీరాములకు ఏకంగా డిప్యూటీ సీఎం పీఠం ఇస్తామని బీజేపీ ప్రచారం చేస్తోంది. ఆయన బంధువులు టీ హెచ్ సురేష్ బాబు - పన్న ఫకీరప్పకు బీజేపీ టికెట్లు ఇచ్చింది. కట్టా సుబ్రమణ్య నాయడు, ఎస్ ఎన్ కృష్ణయ్య సెట్టికి టికెట్లు దక్కాయి. మరోవైపు గాలి కరుణాకర్ రెడ్డికి హరప్పన హళ్ళి టికెట్ కోసం గాలి జనార్ధనరెడ్డి కృషి చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మరోవైపు ఎన్నికల నేపథ్యంలో పోలీసులు రాష్ట్రవాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. బళ్లారి- అనంతపురం జాతీయ రహదారిలో ఒక ప్రైవేటు బస్సులో తరలిస్తున్న రూ.100 కోట్ల నగదును మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. ఇవిగాక రాష్ట్రంలో మరికొన్ని చోట్ల రూ.31.5 కోట్ల నగదు - రూ.4.58 కోట్ల విలువైన మద్యం - రూ.19.79 లక్షల విలువ చేసే 30.52 కిలోల మాదకద్రవ్యాలు - రూ. 3.59 కోట్ల విలువైన 14.492 కిలోల బంగారం - రూ.12.67 లక్షల విలువైన వెండి పట్టుబడింది. బుధవారం బెల్గాంలో రూ.7 కోట్ల విలువైన నకిలీ నోట్లు దొరికాయి. నకిలీనోట్లకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి ఒకరిని అరెస్ట్ చేశారు. కొన్నిచోట్ల వాహనాల్లో తరలిస్తున్న ప్రెషర్ కుక్కర్లు - చీరలు కూడా తనిఖీల్లో పట్టుబడ్డాయి. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టడానికి రాజకీయ నా యకులు ఈ డబ్బు - సరుకులను తరలించడానికి ప్రయత్నించారని పోలీసులు భావిస్తున్నారు. 2013 ఎన్నికలపుడు అక్రమంగా తరలిస్తుండగా రూ.21.44 కోట్ల నగదు - రూ.6.22 కోట్ల విలువైన 1.2 లక్షల లీటర్ల మద్యం - ఇతర సరుకులు పట్టుబడ్డాయి. అయితే ఈ ఎన్నికల సందర్భంగా ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న నగదు, మద్యం, ఇతర సరుకుల విలువ ఆ మొత్తాన్ని దాటిపోయింది. వచ్చే నెల 12 తేదీన ఎన్నికలు పూర్తయ్యేలోగా రికార్డుస్థాయిలో డబ్బు, మద్యం పట్టుబడే అవకాశాలు కనిపిస్తున్నాయి.