Begin typing your search above and press return to search.
కర్ణాటకలో కొత్త వైరస్ - మంకీ ఫీవర్ తో ఇద్దరు మృతి
By: Tupaki Desk | 1 March 2020 1:52 PM GMTప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ హడలెత్తిస్తోంది. ఈ భయానక వైరస్ కారణంగా 2వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. లక్షలాదిమంది ఈ వైరస్ బారినపడ్డారు. రుగోస్ వైరస్ కారణంగా ఏపీలో పండ్లతోటలు నాశనమవుతుండగా, కోళ్లకి వింత వైరస్ సోకి మరణిస్తున్నాయి. ఇప్పుడు కర్ణాటకలోను ఓ వైరస్ కలకలం రేపుతోంది. అదే మంకీ వైరస్. దీని కారణంగా ఇప్పటికే ఇద్దరు మృతి చెందారు. ఈ ఫీవర్‌ను శివమొగ్గ ప్రాంతంలో గుర్తించారు. ఈ వ్యాధి బారిన 55 మంది పడినట్లుగా గుర్తించారు.
స్థానికంగా మంకీఫీవర్ బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మంకీ ఫీవర్ కారణంగా సిద్ధపురకు చెందిన భాస్కర గణపతి హెగ్డే, మరో మహిళ మృతి చెందారు. మంకీఫీవర్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. కలతగా అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని చెబుతున్నారు. మంకీ ఫీవర్‌ను కైసనూర్ ఫారెస్ట్ డిసీజ్ (KFD) అంటారు.
కేరళలోని వాయనాడ్‌లో ఇటీవల తొమ్మిది మందికి పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. ఇది పక్కనున్న ఫారెస్ట్ ఏరియా నుండి వచ్చినట్లుగా గుర్తించారు. శివమొగ్గలో 55 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. వీరిలో 22 మందికి వ్యాక్సిన్లు వేసినట్లు అధికారులు తెలిపారు. ఈ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సూచనలు చేస్తున్నారు.
మంకీ ఫీవర్ వస్తే వారం రోజుల వరకు ఈ లక్షణాలు కనిపించవు. ఆ తర్వాత జ్వరం, తలనొప్పి, నరాల బలహీనత, వాంతులు తిమ్మిర్లు ఉంటాయి. బీపీ, ఎర్రరక్త కణాలు తగ్గడం కనిపిస్తుంది. ఈ వ్యాధి తీవ్రమయ్యాక నోరు, పంటి చిగుళ్లు, ముక్కు నుండి రక్తం వస్తుంది. ఇది పెరిగితే మనిషి మతిస్థిమితం కోల్పోయే ప్రమాదముంది. మంకీ ఫీవర్‌కు సంబంధించి అన్ని వ్యాక్సిన్ల స్టాక్స్ తమ వద్ద ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు.