Begin typing your search above and press return to search.
బ్రెజిల్, స్పెయిన్ లో మంకీ పాక్స్ మరణాలు.. ఆఫ్రికా బయట తొలి.. ప్రమాద ఘంటికే..
By: Tupaki Desk | 30 July 2022 11:30 PM GMTకొవిడ్ తో అతలాకుతలమైన బ్రెజిల్ స్పెయిన్ లో మంకీ పాక్స్ కలకలం. శుక్రవారం ఆ దేశంలో మంకీ పాక్స్ తొలి మరణం నమోదైంది. దక్షిణ బ్రెజిల్ లోని మినాస్ గెరాయిస్ కు చెందిన 41 ఏళ్ల వ్యక్ ఒకరు వైరస్ తో చనిపోయాడు. ఇతడికి ఇతర అనారోగ్య కారణాలు కూడా ఉన్నాయి. కాగా, స్పెయిన్ లోనూ ఓ వ్యక్తి మంకీ పాక్స్ తో చనిపోయాడు. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీ పాక్స్ 78 దేశాలకు వ్యాపించింది. ఆఫ్రికా ఖండం దీని వ్యాప్తి కేంద్రంగా ఉన్నది.
ఈ నేపథ్యంలో గత వారం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ వో) మంకీ పాక్స్ ను ప్రపంచ ఆరోగ్య ఎమర్జెన్సీగా ప్రకటించింది. మరోవైపు ఇప్పటివరకు మంకీ పాక్స్ మరణాలన్నీ ఆఫ్రికా ఖండంలోనే సంభవించాయి. అమెరికా, యూరప్ సహా మరెక్కడా రోగులు చనిపోలేదు. తాజాగా బ్రెజిల్ తో దక్షిణ అమెరికాలో, స్పెయిన్ తో యూరప్ లో మంకీ పాక్స్ తొలి మరణాలు సంభవించాయి.
రెండూ కొవిడ్ బాధిత దేశాలే..బ్రెజిల్, స్పెయిన్ రెండూ కొవిడ్ తో తీవ్రంగా సతమతం అయిన దేశాలే కావడం గమనార్హం. బ్రెజిల్ లో లక్షలాది మంది చనిపోతున్నా ఆ దేశ అధ్యక్షుడు బొల్సొనారో ఏమాత్రం పట్టింపు లేనట్లు వ్యవహరించారు.
దేశాలకు దేశాలు లాక్ డౌన్ లోకి వెళ్తున్నా.. ఆయన మాత్రం నిర్లక్ష్యం చూపారు. అంతేకాదు.. కొవిడ్ గురించి మాట్లాడిన మంత్రిని కూడా తొలగించారు. దీని ఫలితమే బ్రెజిల్ లో లక్షలాది మరణాలు. ఇప్పుడు మంకీ పాక్స్ మరణాలు సైతం ఈ రెండు దేశాల్లో వెలుగుచూడడం కొంత ఆలోచించదగిన అంశమే. ఎందుకంటే.. ఇప్పటివరకు 18 వేల మంకీ పాక్స్ కేసులు రాగా.. అందులో 70 శాతం యూరప్, 25 శాతం అమెరికాలోనే నమోదయ్యాయి.
ఎక్కువ శాతం కేసులు ఉన్న యూరప్ లో.. అది కూడా స్పెయిన్ లో తొలిసారి వైరస్ మరణం నమోదైంది. ఇక బ్రెజిల్ లో ఇప్పటివరకు వెయ్యి మంకీ పాక్స్ కేసులు వచ్చాయి. తొలిసారిగా ఓ వ్యక్తి చనిపోయాడు. అయితే, కొవిడ్ విశ్వరూపం చూపిన సావోపోలో, రియో డి జనీరోలోనే అత్యధిక మంకీ పాక్స్ కేసులు ఉండడం గమనార్హం.
జూన్ 10న బ్రెజిల్ లో తొలి మంకీ పాక్స్ కేసు వచ్చింది. 50 రోజుల్లోనే వెయ్యికి పెరిగాయి. కాగా, మొత్తం కేసుల్లో 98 శాతం స్వలింగ సంపర్క పురుషులే ఉన్నారని, వైరస్ ముప్పు తగ్గాలంటే అలాంటివారు శృంగార భాగస్వాముల సంఖ్య తగ్గించుకోవాలని డబ్ల్యూహెచ్ వో సూచించింది.