Begin typing your search above and press return to search.
ముంబై పార్కులో దర్శనమిచ్చిన మోనోలిత్ !
By: Tupaki Desk | 11 March 2021 11:30 AM GMTమోనోలిత్ .. అంటే ఏకశిల విగ్రహం. నిర్జన ప్రాంతాల్లో ప్రత్యక్షమవుతూ కొద్దిరోజులకు మాయమవుతూ పరిశోధకులకు పరీక్ష పెడుతున్న అంతుచిక్కని ఏకశిల ఈసారి ముంబై లో దర్శనం ఇచ్చింది. అయితే గతంలో జనసంచారంలేని ప్రాంతంలోనే ప్రత్యక్షమయ్యే ఈ వింత స్తంభం ఈసారి మాత్రం ఓ పట్టణానికి అతి సమీపంలో వెలిసింది. ఇది ఎవరైనా కావాలని చేస్తున్న పనా? లేదా.. ఏలియన్స్ సంకేతమా అనేది అర్థం కాక అంతా జుట్టు పీక్కుంటున్నారు.
అయితే, తాజాగా ముంబైలో మోనోలిత్ ప్రత్యక్షమైంది. బుధవారం బంద్రా జాగర్స్ పార్క్ మధ్యలో మోనోలీత్ ప్రత్యక్షమైంది. బంద్రా కార్పొరేటర్ ఆశిఫ్ జకారియా ఆ ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. అద్దంలా మెరిసిపోతున్న ఈ లోహపు స్తంభం మీద ఏవో నెంబర్లు చెక్కి ఉన్నాయని ఆయన తెలిపారు. వాటికి అర్థం ఏమిటో తమకు తెలియదు అన్నారు. అయితే, దీనిపై ఇప్పటిదాకా బృహన్ ముంబై కార్పొరేషన్ స్పందించలేదు. అహ్మదాబాద్ కార్పొరేషన్ లాగా.. దీన్ని కూడా తామే ఏర్పాటు చేశామంటూ ప్రకటిస్తుందేమో చూడాలి మరి.
కాగా, ఇటీవల అహ్మదాబాద్‌లో సైతం మోనోలిత్ ప్రత్యక్షమైన విషయం తెలిసిందే. అయితే అహ్మదాబాద్ లో మోనోలిత్ ను ఓ ఆర్కిటెక్ట్ ఏర్పాటు చేశాడని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఇప్పుబు ముంబైలో ప్రత్యక్షమైన మరో మోనోలిత్ ఎవరు ఏర్పాటు చేశారనే విషయమే ఇంకా మిస్టరీగా ఉంది. మొదటగా ఈ మోనోలిత్, అమెరికాలోని ఉటా రెడ్ రాక్ ఎడారిలో కనిపించింది. ఉటా డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ అండ్ డివిజన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ కు చెందిన సిబ్బంది హెలికాప్టర్ లో వెళ్తుండగా.. ఎడారిలో ఏదో వస్తువు మెరుస్తూ కనిపించింది. దాని వద్దకు వెళ్లి పరిశీలించగా త్రికోణంలో ఉన్న ఎత్తైన స్తంభం కనిపించింది. అయితే, అది ఎవరు ఎప్పుడు ఎలా ఏర్పాటు చేశారనే విషయంపై అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కనీసం రవాణా సదుపాయం కూడా లేని ఆ ప్రాంతంలోకి అంత బరువైన స్తంభాన్ని ఎలా తెచ్చారనేది అప్పట్లో మిస్టరీగా మారింది. ఆ తర్వాత ఇలాంటి స్తంభం కాలిఫోర్నియా, రోమానియాలో ప్రత్యక్షమవడమే కాకుండా భారత్ తో సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ప్రత్యక్షమైంది. కాగా, ప్రపంచంలో ఇప్పటిదాకా ఇలాంటి ఏకశిలలు 30కిపైగా దేశాల్లో ప్రత్యక్షమయ్యాయి. ఆ తర్వాత కొన్ని రోజులకే మాయమైపోయాయి.