Begin typing your search above and press return to search.

ఫిట్‌గా ఉండే ఉద్యోగులకి నెల జీతం బోనస్‌

By:  Tupaki Desk   |   31 Aug 2021 5:30 AM GMT
ఫిట్‌గా ఉండే ఉద్యోగులకి నెల జీతం బోనస్‌
X
ఫైనాన్షియల్‌ బ్రోకరేజ్‌ సంస్థ జెరోదా తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు ఓ విచిత్రమైన బంపర్‌ ఆఫర్‌ ను ప్రకటించింది. ఉద్యోగులు ఫిట్‌ గా ఉండడం కోసం సరికోత్త ఛాలెంజ్‌ ను కంపెనీ విసిరింది. ఆ ఛాలెంజ్‌ లో భాగంగా ఏడాది కాలంలో లక్ష్యాన్ని చేరుకున్నఉద్యోగులకు ఒక నెల జీతాన్ని బోనస్‌ గా ఇస్తామని ప్రకటించింది. అంతేకాకుండా ఛాలెంజ్‌ ను స్వీకరించిన వారిలో లక్కీ డ్రా ద్వారా ఎంపికైన ఒక ఉద్యోగికి రూ. 10 లక్షలను ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది.

కరోనా మహమ్మారి దెబ్బకి అందరి జీవితాలు తారుమారైయ్యాయి. కరోనా ముందు వరకు ఆఫీసులకు వెళ్లి వచ్చేవారు, కరోనా మహమ్మారి పుణ్యమా అని అందుకు భిన్నమైన పరిస్థితి ఏర్పడింది. నెలల తరబడి సాగుతున్న వర్క్ ఫ్రం హోం ఉద్యోగుల మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. సరైన వ్యాయామం లేకపోవటం, ఇష్టారాజ్యంగా ఆహార అలవాట్ల కారణంగా ఉబకాయం బాగా పెరిగిపోతోంది. ఉద్యోగులు ఆరోగ్యవంతంగా, ఫిట్ గా లేకపోవటం కంపెనీకి నష్టం వాటిల్లుతుందన్న విషయాన్ని గుర్తించిన ప్రముఖ ఫైనాన్షియల్ బ్రోకరేజ్ సంస్థ తమ ఉద్యోగులకు తాజాగా బంపర్ ఆఫర్ ను ప్రకటించింది.

ఉద్యోగులు ఫిట్ గా ఉండాలని పేర్కొన్న కంపెనీ, సంస్థ నిర్దేశాలకు అనుగుణంగా ఉంటే ఒక నెల జీతాన్ని బోనస్ గా ఇస్తామని ప్రకటించింది. ఈ చాలెంజ్ ను స్వీకరించిన వారిలో లక్కీ డ్రా ద్వారా ఎంపికైన ఒక ఉద్యోగికి రూ.10లక్షలు ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. లాక్‌ డౌన్‌ మొదలైనప్పటినుంచి ఉద్యోగులు ఇంటికే పరిమితమవ్వడంతో శారీరక శ్రమకు దూరంగా ఉన్నారని కంపెనీ సీఈవో నితిన్‌ కామత్‌ పేర్కొన్నారు. ఉద్యోగుల జీవన విధానంలో, ఆహార విషయంలో గణనీయమైన మార్పులు వచ్చినట్లు తెలిపారు. ఫిట్‌ గా ఉండేందుకు ఉద్యోగులకు ఈ ఛాలెంజ్‌ ను విసిరినట్లు నితిన్‌ కామత్‌ వెల్లడించారు. కంపెనీ తీసుకొచ్చిన ఛాలెంజ్‌ ద్వారా ఉద్యోగుల జీవనా విధానంలో కచ్చితంగా మార్పులు వస్తాయని నితిన్‌ కామత్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఛాలెంజ్‌ ను పూర్తి చేసిన ప్రతి ఉద్యోగికి ఒక నెల జీతం బోనస్‌, లక్కీ డ్రా ద్వారా ఎంపికైన ఒక ఉద్యోగికి రూ.10 లక్షలు అందిస్తామని నితిన్‌ ట్విటర్‌ లో వెల్లడించారు. అయితే , సంస్థ విసిరిన సవాలుకు ఎంత మంది ఉద్యోగులు స్పందిస్తారన్నది ప్రశ్న.