Begin typing your search above and press return to search.
జగన్ కు జైకొట్టిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్’
By: Tupaki Desk | 12 Aug 2022 4:30 AM GMTప్రముఖ మీడియా సంస్ధ ఇండియా టు డే విడుదలచేసిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో ఏపీ జనాలు జగన్మోహన్ రెడ్డికే జై కొట్టారు. నిర్వహించిన సర్వే ఫలితాలను గురువారం అంటే 11వ తేదీన ఇండియా టు డే రిలీజ్ చేసింది. రాష్ట్రంలోని 25 ఎంపీ సీట్లకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే వైసీపీ 18 సీట్లలో గెలుస్తుందని సర్వే తేల్చింది. సర్వే రిపోర్టులన్నీ ప్రతీసారి నిజాలవుతాయని అనుకునేందుకు లేదు.
సర్వేలన్నవి జనాల మూడ్ ఎలాగుందనే విషయానికి శాంపుల్ సర్వేగా పనికొస్తుందంతే. సర్వేలో వెల్లడైన వివరాలను బట్టి జనాల మూడ్ ఎలాగుంది ? మనం అనుసరించాల్సిన విధానాలు ఏమిటి ? టేకప్ చేయాల్సిన అంశాలేమిటి ? అని పార్టీలు తమ స్టాండ్ మార్చుకునేందుకు ఉపయోగపడుతుంది.
వైసీపీ గెలుచుకోగా మిగిలిన 7 సీట్లను టీడీపీ గెలుచుకుంటుందని సర్వేలో తేలింది. ఈమద్యనే ఇదేపేరుతో ఇండియా టు డే ఇలాంటి సర్వే ఫలితాలనే విడుదల చేసిన విషయం తెలిసిందే.
తాజా సర్వేలో బీజేపీ+జనసేనకు ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాదని తేలిపోయింది. అయితే రాబోయే ఎన్నికల్లో పార్టీల మధ్య పొత్తులు డిసైడ్ అయితే సమీకరణలు మారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక తెలంగాణా విషయానికి వస్తే మొత్తం 17 లోక్ సభ సీట్లలో టీఆర్ఎస్ కు 8 సీట్లు వస్తాయని తేలింది.
బీజేపీకి 6 సీట్లు వస్తుందట. ఇక మిగిలిన మూడు సీట్లు కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు గెలుచుకుంటాయని సర్వేలో తేలింది. అంటే కాంగ్రెస్ పరిస్ధితి మరింత దయనీయంగా మారబోతోందని సర్వేలో తెలింది.
బీజేపీకి ఇపుడున్న నాలుగుసీట్లకు మూడు అదనంగా వస్తాయి. అలాగే టీఆర్ఎస్ కు ఒకసీటు మైనస్ అవుతుందని తేలింది. మొత్తానికి షెడ్యూల్ ఎన్నికల్లోగా ఇంకెన్ని సర్వే ఫలితాలు వస్తాయో, ఎన్నిసీట్లలో మార్పులు జరుగుతాయో చూడాల్సిందే.