Begin typing your search above and press return to search.
ఆర్థికంగా ఇప్పుడు భారీగా క్షీణించినా భవిష్యత్ భారత్ దే
By: Tupaki Desk | 18 Jun 2020 12:50 PM GMTమహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ కూడా పూర్తిగా క్షీణించిన విషయం తెలిసిందే. దీనిపై కొన్ని ఆర్థిక సంస్థలు, నిపుణులు ఇప్పుడు భారత్‌కు భారీగా నష్టాలు వచ్చినా భవిష్యత్‌లో ఆశజనక వాతావరణం ఉంటుందని వెల్లడిస్తున్నాయి. ఇటీవల ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ భారత్ రుణ రేటింగ్‌ను తగ్గించింది. మరో రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ రేటింగ్స్ గురువారం ఇండియా స్థిరత్వం నుంచి నెగిటివ్‌కు సవరించింది. దీనికి కారణంగా వైరస్ - లాక్ డౌన్ భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ప్రభావం చూపిందని ఆ సంస్థ వెల్లడించింది. గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ రెండు దశాబ్దాల తర్వాత తొలిసారి భారత్ రుణ రేటింగ్‌ను Baa2కు తగ్గించింది.
రేటింగ్ ఏజెన్సీ భారత్ లాంగ్ టర్మ్ ఫారెన్ కరెన్సీ ఇష్యూయర్ డిఫాల్ట్ రేటింగ్ (ఐడీఆర్)ను స్టేబుల్ నుంచి నెగిటివ్ రేటింగ్ బీబీబీ-కు మార్చింది. లాక్ డౌన్ కారణంగా 2021 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు ఐదు శాతం క్షీణించే అవకాశం ఉందని హెచ్చరించింది. అయితే 2021-22 ఆర్థిక సంవత్సరంలో మాత్రం 9.5 శాతానికి పుంజుకుని సత్తా చాటుతుందని వెల్లడించింది. వైరస్ భారత వృద్ధి దృక్పథాన్ని గణనీయంగా బలహీనపరిచిందని, అధిక రుణభారాన్ని బహిర్గతం చేసిందని తెలిపింది.
అయితే వైరస్ కంటే ముందే మందగమనం ఉండడంతో అప్పటికే భారత్‌లో వివిధ రంగాలు ఇబ్బందుల్లో ఉన్నాయని గుర్తుచేసింది. బ్యాంకింగ్ రంగంలో అంతకుముందు కంటే రుణ భారం తగ్గింది. బ్యాంకింగ్ రంగంలో ఎన్పీఎల్ (నాన్ ఫర్ఫార్మింగ్ లోన్) రేషియో రెండేళ్ల క్రితం 11.6 శాతం ఉండగా, 2020 ఆర్థిక సంవత్సరంలో 9.0కు తగ్గిందని ఫిచ్ రేటింగ్ అంచనా వేసింది. దీనికి ప్రధాన కారణంగా ప్రభుత్వం మూలధనం ఇంజెక్ట్ చేయడమే కారణమని పేర్కొంది.
మందగమనం, వైరస్ కారణంగా ప్రభుత్వ ఆదాయం తగ్గిందని ఫిచ్ రేటింగ్ ఏజెన్సీ తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రుణ రేటు 84.5 శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తోంది. 2020 ఆర్థిక సంవత్సరంలో 71.0 శాతంగా ఉండగా వైరస్ కారణంగా వివిధ కారణాలతో జీడీపీ వృద్ధి రేటు ప్రతికూలంగా ఉంటుందని హెచ్చరించింది.